జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు లోటుపాట్లు లేకుండా నిర్వహించటానికి చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు లోటుపాట్లు లేకుండా నిర్వహించటానికి చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని ఆమె చాంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మున్సిపల్, పంచా యతీరాజ్ అధికారు లతో సమీక్ష సమావే శం నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థలు నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వ హించడానికి ప్రభుత్వం నోటిఫికే షన్ జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని నర్సాపూర్ మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలో ఈనెల 16 తేదీ నుండి 18వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించడం జరుగు తుందన్నారు. 28వ తేదీన పోలింగ్ జరు గుతుందన్నారు. 30వ తేదీ ఎన్నికల కౌంటింగ్ జరుగు తుందని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ సిబ్బందికి వెంటనే శిక్షణ ఇవ్వాలని ఆమె చెప్పారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభ మైనందున ఎన్నికల ప్రవర్తన నియమా వళిని అమలు చేయాలని అధికారు లకు చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. అర్.కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా పర్షిత్ సి.ఇ.ఓ రమణ, జిల్లా పంచాయతీ అధికారి దోసిరెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ రామ చంద్రారెడ్డి, నరసాపురం మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, ఆకివీడు మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.——— జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం భీమవరం నుండి జారీ చేయడమైనది.