Close

జిల్లాలో సుమారు 9 వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం, తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

Publish Date : 28/10/2025

మంగళవారం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్ తో ఏర్పాటు చేసిన టెలీ కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాణనష్టం లేకుండా… ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
• ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై ఫోకస్ అధికారులు ఫోకస్ పెట్టాలి.
• కాల్వలు, చెరువులకు గండిపడకుండా చూడండి.. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండండి.
• లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి… రిలీఫ్ క్యాంపులకు తరలించండి.
• తుఫాను ప్రభావం వల్ల కరెంట్ కట్ చేయాల్సి రావచ్చు… ముందుగానే ప్రజలకు క్యాండిళ్లను సరఫరా జరిగేలా చూడండి.
• తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. అలెర్టుగా ఉండండి.
• పునరావాస శిబిరాల్లో ఉండేవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి.
• అధికారులు-ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి.
• సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాలి… క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటే.. ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది.
• భారీ వర్షాల వల్ల పడే నీరు నిల్వ ఉండకుండా.. కాల్వలు, డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంప్ చేయాలి.
• విజయవాడ, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.
• ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం అనేది ఉండకూడదు.
• తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకూ తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలి.. మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలి.
• తప్పుడు సమాచారం.. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
• రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలి.
• రైతులకు తుఫాన్ అలెర్టులు ఎప్పటికప్పుడు చేరేలా చూడాలి.
• పంట నష్టంపై ప్రాథమిక, పూర్తి స్థాయి అంచనాలను రూపొందించుకునే దిశగా ఫోకస్ పెట్టాలి.
• మొంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని జాతీయ రహదారులపై రాకపోకలను నిలపాలి.
• రహదారులపై రాకపోకలు నిలపాల్సిన పరిస్థితే వస్తే… సమాచారాన్ని ముందుగానే సమాచారం అందివ్వాలి.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాను ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి కి వివరిస్తూ జిల్లాలో ప్రస్తుతం అంచనా వేసిన వర్షపాతం కంటే తక్కువగానే నమోదు అయిందని, కాకపోతే గాలులు వేగం పెరిగిందని తెలిపారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు గొట్టిపాటి రవికుమార్, జిల్లాలోని శాసనసభ్యులు, ఏపీఐఐసీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, నాతో సహా అందరూ క్షేత్రస్థాయిలో తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించడం జరుగుచున్నదని వివరించారు. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నియోజకవర్గాల్లోని మండలాల్లో 44 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 9 వేల మందిని పునరవాసి కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే నాలుగు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా తీర ప్రాంతంలోని 8 గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఇప్పటికే 17 గ్రామాలు నీటి తాకిడికి గురయ్యాయని తెలిపారు. ఎన్ డి ఆర్ ఎఫ్ టీమ్ తో పాటు, జనరేటర్లు తదితర ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ కాల్ సెంటర్ కు చెట్లు పడిపోవడం తదితర 16 ఫిర్యాదులు అందాయని వాటి అన్నింటిని పరిష్కరించడం జరిగిందన్నారు. అన్ని పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, కాలవలు, స్లూయిస్ వద్ద చెత్త అడ్డం పడకుండా ఎప్పటికప్పుడు తొలగించేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.