Close

జిల్లాలో వెట్టిచాకిరి కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 09/02/2026

వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి

వెట్టి చాకిరి నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో వెట్టి చాకిరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు 50 సంవత్సరాలు పూర్తయి సందర్భంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వర్ణోత్సవ ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వెట్టిచాకిరి వ్యవస్థ అనేది సామాజిక అన్యాయానికి ప్రతిగా నిలిచిందని ఇటువంటి దురాచారాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం గత ఐదు దశాబ్దాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 1976 సంవత్సరంలో వెట్టి చాకిరి నిర్మూలన చట్టం అమల్లోకి రావడం జరిగిందన్నారు. దేశంలో సమానత్వం మానవ గౌరవం హక్కుల పరిరక్షణకు బలమైన పునాది పడింది అన్నారు ప్రభుత్వం కార్మికుల హక్కుల పరిరక్షణ సంక్షేమ కోసం అనేక చట్టాలు పథకాలు అమలు చేస్తుందని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉండాలని అన్నారు ఎక్కడైనా పెట్టి చాకిరీ లేదా బలవంతపు శ్రమ జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విడుదల చేసిన గోడ పత్రిక ద్వారా వెట్టి చాకిరి నిర్మూలన చట్టపరమైన చర్యలు ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో చైతన్యం పెంచి మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976లో దేశవ్యాప్తంగా రద్దు చేయడం జరిగిందని వెట్టి చాకిరి అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన మరియు చట్టానికి విరుద్ధమని అట్టి వాటిని ప్రోత్సహించే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అన్నారు.

ఈ సందర్భంలో జిల్లా కార్మిక శాఖ అధికారి డా.ఆకన లక్ష్మి, క్రాప్ డిస్టిక్ కో ఆర్డినేటర్ ఎస్.శ్రీను, డిపిఎం విజ్ఞాన కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తదితర అధికారులు ఉన్నారు.