జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ, మత్స్య, మార్క్ఫెడ్ అధికారులతో ఎరువుల లభ్యత, వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు మొత్తం 58,905 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం గాక వాటిలో యూరియా 21,270 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 37,634 మెట్రిక్ టన్నులు అవసరం అన్నారు. జూలై నెలాఖరు నాటికి యూరియా 3,278 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 15,160 మెట్రిక్ టన్నులు అవసరం అన్నారు. నేటికీ జిల్లాలో యూరియా 18,025 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 47,911 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు యూరియా 7,470 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 10,287 మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఇవే కాకుండా హోల్ సేల్, రిటైల్ ఫెర్టిలైజర్స్, ఏపీ మార్క్ఫెడ్ వద్ద కూడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైతులు అవసరానికి మించి ఎరువులను వినియోగించవద్దని సూచించారు. ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులను వినియోగించాలని తద్వారా మంచి దిగుబడి, తక్కువ పెట్టుబడి, భూమికి సారం లభిస్తాయి అన్నారు. జిల్లాలో గుర్రపు డెక్క ద్వారా వర్మి కంపోస్ట్ తయారిని చేపట్టడం జరిగిందని, అధిక పోషక విలువలుఉన్న గుర్రపు డెక్క కంపోస్ట్ ను అవసరమైన రైతులు వినియోగించుకోవాలి ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగాచార్యులు, జిల్లా మార్క్ఫెడ్ అధికారి. పాల్గొన్నారు.