Close

జిల్లాలో యూరియా కొరత లేదు, రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలి

Publish Date : 22/01/2026

కౌలు రైతులను పిఎసిఎస్ లో మెంబర్లు గా చేర్చుకుని పంట రుణాలను అందజేయాలి..

రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి..

తణుకు మండలం వేల్పూరు గ్రామం ఏర్పాటుచేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులకు డివిడెండ్, వడ్డీ రాయితే పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సహకార సంఘాలు ఎరువులు అమ్మకాలు, పాల సేకరణ, గోల్డ్ లాకర్స్, పంట రుణాలు తదితర సేవలను రైతులకు అందిస్తూ ఆర్థికంగా బలపడడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. ఇక్కడ ఉన్న రైతు మెంబర్స్ అందరికీ కూడా డివిడెండ్ రూపంలో 668 మంది రైతులకు ఇంచుమించు 14 లక్షల రూపాయలు, 23, 24 సంవత్సరాల సంబంధించి వెయ్యి మంది రైతులకు మూడు సార్లు వడ్డీ రాయితీ 18 లక్షల 51 వేల రూపాయలు అందించే కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మన ముఖ్యమంత్రి రైతులకు ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సహాయం చేయాలి అని చెప్తారు. అలాగే కొత్తగా వచ్చే అధునిక టెక్నాలజీ అన్ని అందివ్వాలి చెప్పడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మన జిల్లాకి 43 డ్రోన్లు సబ్సిడీతో అందించడం జరిగిందన్నారు. మారుతున్న కాలంలో కూలీల లభ్యత సరిగ్గా లేక రైతులకు ఇన్పుట్ ఖర్చు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఈ డ్రోన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వారికి ఆదాయం వనరుగా ఉంటూ రైతులకు సహకారంగా ఉండటానికి ఉపయోగిస్తారన్నారు. యూరియా మన జిల్లాకి ఎంత అవసరం ఉంది అంటే అంత మనకి పంపించడం జరుగుతోందని, రైతులు ఎవరు కూడా రాబోయే పంటకు ఎవరు స్టాక్ చేసుకోవద్దని తెలిపారు. ఎంత అవసరమైతే అంతే రైతులు తీసుకోవాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీకు కావాల్సిన అంత యూరియా అందివ్వడానికి ప్రభుత్వము, జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యే అంతా కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. మన జిల్లా దేశవ్యాప్తంగానే ఎక్కువ యూరియా వినియోగించే జిల్లాల్లో ప్రముఖంగా కనబడుతోందని, దయచేసి అందరు యూరియా వాడకాన్ని తగ్గించుకోవలసిందిగా ముఖ్యమంత్రి కూడా పదే పదే చెప్తూ ఉంటారన్నారు. యూరియా ఎక్కువ వినియోగం వల్ల మన ఆహారంలో, మన తాగునీటిలో, గాల్లో కలిసి పెద్దలకి, పిల్లలకి కూడా ఆరోగ్యానికి హానికరం కావడం మన కళ్ళతో మనం చూస్తున్నాం అన్నారు. డిపార్ట్మెంట్ ఇచ్చే సూచనలు పాటిస్తూ యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు కూడా పిఎసిఎస్ ల్లో మెంబర్స్ చేసుకోవాలని, ఇంతకుముందే ఈ సొసైటీలో కౌలు రైతులను సభ్యులుగా చేర్చుకొని 30 మందికి రుణాలను ఇవ్వడం సంతోషించదగిన విషయం అన్నారు. ఇదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులను సభ్యులుగా చేర్చుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కౌలు రైతులకు కూడా లోన్స్ ఇవ్వడానికి డిపార్ట్మెంట్, సొసైటీసు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.

శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ 2014 – 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్రతి రైతుకు కూడా సబ్సిడీ మీద తార్పాలిన్ లను అందించడం జరిగిందన్నారు. రైతులకు మరల టార్పాలిన్ లను అందించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అలాగే ఇక్కడ ధాన్యం సేకరణకు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్స్ సొసైటీకి రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఎంత వస్తే అంత ప్రతి రైతుకు టార్పాలిన్ లు సబ్సిడీ మీద ఇవ్వాలని కోరారు. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా కలెక్టర్ ఆదేశాలతో కౌలు రైతులకు కూడా సొసైటీల ద్వారా రుణ సదుపాయం కల్పించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామన్నారు. నేను నియోజకవర్గానికి శాసనసభ్యులు అయినా, వేల్పూరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారిని ఆర్థికంగా ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. ఎన్నడూ లేని విధంగా ధాన్యం డబ్బులను 24 గంటల లోపు గానే జమ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లించకుండా పెద్ద ఎత్తున బకాయిలను పెట్టిందన్నారు. యూరియాకి ఇబ్బంది లేదని, కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హితవు పలికారు.

అనంతరం పిఎసిఎస్ లో నెంబర్లుగా ఉన్న రైతులకు డివిడెండ్ కింద రూ.13,83,954/- లు, మూడు శాతం వడ్డీ రాయితీ కింద రూ.18,51,490/- లు నమూనా చెక్కులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం ది వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్లో ఉన్న యూరియా, డీఏపీ నిలువలను పరిశీలించి, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి సంకు మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి మోహన్, ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, మాజీ ఏఎంసి, పిఎసిఎస్ అధ్యక్షులు, స్థానిక కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.