జిల్లాలో భారీ ఎత్తున మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ఏర్పాట్లు..

జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 2,79,204 మంది, 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్న 37,124 విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యులను చేస్తున్నాం..
తల్లికి వందనం పేరిట 1,76,574 మంది తల్లులకు రూ.229.55 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది..
“ఏక్ పెడ్ మా కే నామ్”లో భాగంగా గ్రీన్ పాస్‌పోర్ట్ పేరిట ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి వారి తల్లి పేరున పెంచేలా చర్యలు..
తల్లి మీద మరింత గౌరవం పెంపొందించేందుకు విద్యార్థులతో పాధ పూజ కార్యక్రమం నిర్వహణ..
జూలై 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ను పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నుండి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగాను, డివిజన్, మండల స్థాయి అధికారులతో వర్చువల్ గాను సమావేశాన్ని నిర్వహించి జిల్లాలో నిర్వహించనున్ను పేరెంట్స్, టీచర్స్ మీట్ ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వం విద్యార్థులకు బంగారు భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే విధంగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో జూలై 10న పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఆదేశించడం జరిగిందన్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు చేకూరాలనే లక్ష్యంతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం చెప్పింది ఏదో చేస్తున్నావ్ అనే ధోరణి కాకుండా విద్యార్థులకు సంబంధించిన మంచి కార్యక్రమంగా అంకితభావంతో చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు జిల్లాకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మెంబర్లు, జడ్పిటిసి, ఎంపీటీసీ, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయాలని కోరారు. ఎవరికి సంబంధించిన వ్యక్తిగత బ్యానర్లను కార్యక్రమం వద్ద పెట్టవద్దని, ప్రభుత్వం సూచించిన బ్యానర్లు మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా 6, 7, 8 తరగతుల్లో డ్రాప్ ఔట్ట్స్ ఉంటున్నాయని, బడి బయట పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని, అట్టివారిని గుర్తించి ప్రతి ఒక్కరిని పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పేద కుటుంబాలకు చదువు భారం కాకూడదని నచ్చిన పాఠశాలలో విద్యను అభ్యసించేలా తల్లికి వందనం పేరిట 1,76,574 మంది తల్లులకు రూ.229.55 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసిందన్నారు. “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా గ్రీన్ పాస్‌పోర్ట్ పేరిట ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి వారి తల్లి పేరున పెంచేలా చర్యలను చేపట్టడం జరిగిందని, దీనికి లీప్ యాప్ ను రూపొందించి యాప్ లో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వన్-ఆన్-వన్ ఇంటరాక్షన్ లో క్లాస్ ఇన్‌చార్జ్ ప్రతి విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ & హెల్త్ కార్డ్ గురించి వారి తల్లిదండ్రులతో కారిడార్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెస్క్ వద్ద కూర్చొని చర్చించడం జరుగుతుందన్నారు. తల్లులకు రంగోలి పోటీలను, తండ్రులకు తగ్గాఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్ ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ను దిగ్విజయం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిఇఓ ఇ.నారాయణ, ఏపీసి శ్యాంసుందర్, డిఐఈఓ గొల్ల ప్రభాకర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.