Close

జిల్లాలో ప్రముఖంగా ఉన్న రెండు పంచారామ క్షేత్రాలతో పాటు, ప్రాముఖ్యత కలిగన శైవాలయాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 13/02/2026

వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ సేవలపై ప్రజా సానుకూల స్పందన, మహాశివరాత్రి ఉత్సవాలు, పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, కోర్టు భవనాల స్థలాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి స్థాయి పెరగాలని సిఎస్ కోరారు. ఆ దిశగా లోపాలను సవరించుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించాలన్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో మహాశివరాత్రి ఏర్పాట్లు, పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలు ఏర్పాట్లుపై తీసుకున్న పకడ్బందీ చర్యలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సీఎస్ కు వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.