జిల్లాలో పేదల గృహాలు నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ బాబు అన్నారు.

గురువారం ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామం లే అవుట్ ను రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన గృహా నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి అవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకాల కింద పేదల కోసం 56,210 గృహాలు మంజూరు చేయగా ఇప్పటివరకు 35,970 గృహాలను పూర్తి చేయడం జరిగిందని, ఇంకా 20,240 గృహములు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని కుప్పనపూడి లేఅవుట్ ను సందర్శించి పేదల ఇళ్ల నిర్మాణాలు ఎంతవరకు పూర్తి అయినవి, ఇంకా పూర్తి చేయవలసినవి ఎన్ని ఉన్నాయి పరిశీలించటం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని లే అవుట్ లలో మౌలిక సదుపాయాలను నూటికి నూరు శాతం వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణ పనులు ప్రగతి పై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. వీటి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరలో లబ్ధిదారులకు అప్పగించి వారితో గృహప్రవేశాలు చేయించే దిశగా నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య, గృహ నిర్మాణ శాఖ డి.ఈ పి.శివరామరాజు, ఇన్చార్జి తహసిల్దార్ ఫరూక్, గృహ నిర్మాణ శాఖ ఏఈ ఎం.అభి తేజ్, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.