జిల్లాలో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి వ్యాపారస్తులు సహకరించాలి ఇన్చార్జి జిల్లా కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించాలి
మార్కెట్ ధరలు పెరగకుండా టోకు వర్తకులు సహకరించాలి
నిత్యవసర సరుకులు సరసమైన ధరలకు అందించి మార్కెట్లో ధరలు పెరగకుండా సహకరించాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను కోరారు.
.
బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా లోని చాంబర్ ఆఫ్ కామర్స్, కూరగాయలు ,వర్తక సంఘాలు సభ్యులతో నిత్యవసర సరుకులు నియంత్రణపై ఇన్చార్జి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర సరుకులు , కూరగాయలు,సరసమైన ధరలకు అందించి మార్కెట్లో ధరలు పెరగకుండా వర్తకులు సహకరించాలని అన్నారు. ప్రస్తుతం పచ్చిమిర్చి ఉత్పత్తి తక్కువగా ఉన్నందున టోకు వర్తికులపై ఆధార పడవలసి వస్తుందని వారు అధిక లాభములకు విక్రయించకుండా వారికి కూడా నష్టము జరగకుండా సరసమైన ధరలకు ప్రజలకు అందించడానికి సహకరించాలని అన్నారు. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. బియ్యం, పప్పులు, ఆయిల్, తదితర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. జిల్లాలో పూర్తిగా ప్లాస్టిక్ నియంత్రణ ఉన్నందున కిరాణా, కూరగాయలు షాపులు దారులు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా సహకరించాలని, వినియోగదారులకు అవగాహన కల్పించాలని కోరారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం, జరిమానాలు విధించటం జరుగుతుందని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఎస్ ఎన్ సరోజ, జిల్లా మార్కెటింగ్ ఏడి ఎం సునీల్ కుమార్, భీమవరం రైతు బజార్ ఎస్టేట్ అధికారి కళ్యాణ్, భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నరసాపురం పాలకొల్లు తాకివీడు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వర్తక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.