జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఔత్సాహికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు
మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది. పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని వర్చువల్ గా తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ రంగాల్లో 48 పరిశ్రమలకు శంకుస్థాపనలు, నాలుగు పరిశ్రమలు ప్రారంభోత్సవాలు, రూ.21 వేల కోట్ల వ్యయంతో 24 వేల మందికి ఉపాధి కల్పించేలా సమకూర్చడం జరిగిందన్నారు. జిల్లాలో మొదటి దశలోనే పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని, నేను రెండో విడత కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని, దరఖాస్తు నాటి నుండి పరిశ్రమ గ్రౌండ్ అయ్యేవరకు సంబంధిత అధికారులు సహాయ సహకారాలను అందిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు. మంగపతి రావు, ఏపీఐఐసీ విజయవాడ డి జెడ్ ఎం ఎంఏ.రహీం, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కూటమి ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు