Close

జిల్లాలో నూరు శాతం క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 29/05/2025

జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన టిబి ఫోరం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా సరే టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని “నిక్షయ్ మిత్ర” గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరారు. టిబి వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారం నిమిత్తం నెలకు రూ.600/- లు విలువగల పౌష్టికాహార సరుకులను అందచేయాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం స్ఫూర్తి పొందిన జిల్లా కలెక్టర్ తాను కూడా నిక్షయ్ మిత్ర 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు దత్తత తీసుకొని ఆహారాన్ని అందించేందుకు సమావేశంలో ప్రకటించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు క్షయ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి ముందుకు రావాలని, నిక్షయ్ మిత్రగా నమోదయి పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు అవసరమైన సరుకులను అందించి క్షయ వ్యాధిగ్రస్తులు యొక్క ఆరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడాలన్నారు. ఇంటెన్సిఫైడ్ టిబి ముక్తభారత్ క్యాంపెయిన్ కింద 60 సంవత్సరాల పైబడిన వారు, షుగర్ పేషెంట్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, మద్యం సేవించేవారు, పొగ తాగేవారు, గతంలో టీబీ వ్యాధిని పడినవారు, టీబీ వ్యాధిగ్రస్తుల ఇళ్లల్లో కలిసి నివసిస్తున్న వారు అంతా టిబి పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధి నిర్ధారణ చేసుకుని మన భారతదేశాన్ని క్షయ వ్యాధి లేని దేశంగా తీర్చిదిద్దాలని కోరారు.

ఇంటెన్సిఫైడ్ టీబి ముక్త్ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా చివరిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా క్షయ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం తదితర సమాచారంతో కూడిన గోడపత్రికలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జి.గీతాబాయి, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ బి.భాను నాయక్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి.సూర్యనారాయణ, మన హాస్పిటల్ డాక్టర్ డి.మల్లికార్జున రావు, డ్వామా పిడి కె సి హెచ్ అప్పారావు, డిపిఓ దోసి రెడ్డి, డిఎన్ఎమ్ఓ డాక్టర్ వై.క్రాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.