జిల్లాలో నీట్ యూజీ పరీక్షలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని, 97.5% హాజరైనట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన రెండు నీట్ యూజీ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. నిట్ లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 1,128 పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 1,108 మంది, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 758 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 739 మంది పరీక్షలు హాజరయ్యారు. మొత్తం 1,886 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 1,847 పరీక్షలకు హాజరుకాగా, 39 మంది గైరు హాజరు కావడంతో మొత్తం 97.5% హాజరైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు మెంబర్ అద్నాన్ నయీం అస్మి పర్యవేక్షించగా, ఇతర సభ్యులు డిఆర్ఓ, డిఇఓ, ఐబి డిప్యూటీ ఎస్పీ, డి.ఐ.ఓ., పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లాలో పరీక్షలను సజావుగా పూర్తి చేయడానికి విధులను నిర్వర్తించిన అధికారులకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, పరీక్షల కోఆర్డినేటర్ ఎన్.జయరామ్, తదితరులు ఉన్నారు.