జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

స్వచ్ఛ భారత్ మిషన్ & జల జీవన్ మిషన్ అమలు, నిర్వహణ పై బుధవారం దేశ ఢిల్లీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. వీడియోకాన్ఫరెన్స్ సమావేశానికి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బి.వి.గిరి , తదితరులు పాల్గొన్నారు. డి డబ్ల్యు ఎం ఎస్ సెక్రటరీ మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో రెండు నీటి స్వచ్ఛత పరీక్షల ల్యాబ్ లు ఉన్నాయని, ఒక్కదానికి మాత్రమే ఎన్ ఎ బి ఎల్ గుర్తింపు ఉన్నదని, రెండవ ల్యాబ్ కి కూడా గుర్తింపుకు దరఖాస్తు చేయాలని సూచించారు. అలాగే డిస్టిక్ వాటర్ శానిటేషన్ మిషన్ పేరిట కొత్త డాష్ బోర్డును అందుబాటులో తీసుకొచ్చిందని, డేటా అప్డేషన్ పై పీపీటీ ద్వారా వివరించారు. జెజెఎం, స్వచ్ఛభారత్ డేటాను ఎప్పటికప్పుడు బి డబ్ల్యూ ఎస్ ఎం నందు నమోదు చేయాలని సూచించారు. డి డబ్ల్యు ఎస్ ఎం, దిశ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి సంబంధిత మినిట్స్ ను వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జల జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులకు సంబందించి కేంద్ర డిడిడబ్ల్యూఎస్ సెక్రటరీ కి వివరిస్తూ జిల్లాలో జేజేఎం వర్క్ జరుగుచున్న సాంకేతిక ఇబ్బందుల వలన ఆన్లైన్ అప్డేట్ చేయడానికి సాధ్యం కావడం లేదని, సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జెజెఎం వెబ్సైట్లో త్రాగునీటి వసతులు కల్పించిన పాఠశాలలు, అంగన్వాడీల డేటా వ్యత్యాసంగా చూపిస్తున్నదని డి డబ్ల్యు ఎం ఎస్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు.