జిల్లాలో చేపట్టిన వివిధ సర్వేలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గ్రామ వార్డు సచివాలయల సిబ్బంది చేయుచున్న సర్వేలుపై గూగుల్ మీట్ ద్వారా మునిసిపల్ కమీషనర్లు, యంపిడిఓలతో పి-4 సర్వే, వర్క్ ఫ్రం హోం సర్వే, తోలు కళాకారులు సర్వే, చైల్డ్ ఆధార్ మరియు బర్త్ సర్టిఫికెట్ వివరములను నమోదు, జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ రివెరిఫికేషన్ డెత్ మార్క్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఏపీ నాన్ రెసిడెంట్ మాడ్యూల్, ఎన్ పి సి ఐ ఇన్ యా లింకింగ్, తదితర అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన సర్వేలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్నారు. సర్వేలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నదని ఈ విషయం సంబంధిత అధికారులు గుర్తించుకుని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
వర్క్ ఫ్రం హోం సర్వే.. స్వర్ణాంధ్ర @2047 లో భాగంగా ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ ఎకో సిస్టమ్- ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ప్రం హార్ అవకాశాలు కల్పించేందుకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి వివరాలను సేకరించాలన్నారు. మునిసిపల్ కమీషనర్లు, యం. పి. డి. ఓ లు సచివాలయంలోని సిబ్బంది అందరితో వర్క్ ఫ్రం హోం సర్వే వివరాలు అప్డేట్ చేయించాలన్నారు. వర్క్ ఫ్రం హోం సర్వే లో ఐటి విభాగాల్లో పని చేయుటకు ఆశక్తి చూపిన వారికి ఐటి విభాగాల్లో శిక్షణ ఇచ్చుటకు గ్రామాల్లో అన్ని వసతులు ఉన్నవో లేదో తెలుసుకొనుటకు విలేజ్ ప్రొఫైల్ మాడ్యూల్ సచివాలయ సిబ్బంది ఎంప్లాయ్ మొబైల్ యాప్ లాగిన్లో ఇవ్వడం జరిగినదన్నారు. కావున మునిసిపల్ కమీషనర్లు, యం.పి.డి.ఓలు సచివాలయంలోని సిబ్బంది అందరితో విలేజ్ ప్రొఫైల్ ఖచ్చితమైన సర్వే వివరాలు అప్డేట్ చేయించాలని ఆదేశించారు.
తోలు కళాకారుల సర్వే వార్డు వెల్పేర్ సిబ్బందితో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తోలు కళాకారుల వివరాలను అప్డేట్ చేయించాలన్నారు. ఈ సర్వేను 10 రోజులలో పూర్తి చేయాలన్నారు. సర్వేలో ఏ ఒక్క తోలు కళాకారుడు మిస్ అవ్వడానికి వీల్లేదని ఆదేశించారు.
పీపుల్ సర్వేని సమర్థవంతంగా నిర్వహించాలి
జిల్లాను ప్రగతి పథంలో నడిపించి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన పీపుల్ సర్వేని మార్చి ఎనిమిది నుండి మార్చి పూర్తి చేయాలన్నారు. పి-4 విధానం (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్ షిప్) ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడానికి జీవన ప్రమాణాలలో అట్టడుగు స్థాయిలో గల 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వే అన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇల్లు పేదరికాన్ని అధిగమించి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పి-4 పాలసీని అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వారి సహకారంతో అట్టడగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పి4 విధానాన్ని అవలంభిస్తున్నదన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న వారిని గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను సర్వే చేపట్టి వివరాలను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ లు, ఎంపిడిఓ లను ఆదేశించారు.
మిస్సింగ్ పౌరుల గృహ డేటా ను బేస్ కు చేర్చడం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల నుండి 1,58,542 మిస్సింగ్ పౌరుల వివరాలను సెక్రటరీలు లాగిన్ లో ఇవ్వడం జరిగినది. ఇప్పటి వరకు కేవలం 1,13,489 చేసియున్నరన్నారు. కావున మునిసిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు మిస్సింగ్ పౌరులను హౌస్ హోల్డ్ డేటాబేస్కు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో యాడ్ చేయించాలని ఆదేశించారు.
హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ లో సచివాలయ సిబ్బంది కొంతమంది వివరాలు తప్పుగా అప్డేట్ చేసియున్నారని, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ తప్పుగా ట్యాగ్ చేసిన హౌస్ హోల్డ్ డేటా తిరిగి సచివాలయ సిబ్బంది లాగిన్స్ లో ఇవ్వడం జరిగినదన్నారు. కావున అందరు యంపి డి ఓ లు & మున్సిపల్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోని సచివాలయ సిబ్బందితో హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ పూర్తి చేయించాలని ఆదేశించారు.
జిల్లాలోని చైల్డ్ ఆధార్ మరియు బర్త్ సర్టిఫికెట్ వివరములను నమోదు చేయుటకు సచివాలయ సిబ్బంది ఎంప్లాయ్ మొబైల్ యాప్ లాగిన్ ఇవ్వడం జరిగినదన్నారు. నరసాపురం, తాడేపల్లిగూడెం, పెనుగొండ తక్కువ లక్ష్యసాధనలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జియో ట్యాగింగ్ హౌస్ హోల్డ్ రివెరిఫికేషన్ డెత్ మార్క్ లో సచివాలయ సిబ్బంది డెత్ మార్క్ చేసిన పౌరుల వివరాలు పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిన్ సెక్రటరీ 10% డెత్ వివరాలు రివెరిఫికేషన్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో యం పి డి ఓ లు మరియు మున్సిపల్ కమిషనర్లు 5% డెత్ వివరాలు రివెరిఫికేషన్ చేయాలన్నారు. రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రోగ్రెస్ చివరి స్థానం లో ఉన్నదని, జిల్లాలో తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం అర్బన్, పెనుగొండ, గణపవరం & ఆకివీడు మండలలో పూర్ ప్రోగ్రెస్లో వున్నాయని తెలిపారు.
ఎన్ పి సి ఐ ఇన్ యాక్టివ్ లింకేజ్ వివరాలను తప్పుగా అప్డేట్ చేసియున్నారు. కావున ఎన్పీసీఐ ఇనాక్టివ్ డేటా తిరిగి సచివాలయంలోని సిబ్బంది అందరి లాగిన్ లలో ఇవ్వడం జరిగినదన్నారు. కావున ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగు చర్యలు తీసుకొని నూరు శాతం తప్పులు లేకుండా పూర్తి చేయించాలన్నారు. మొగల్తూర్, పోడూరు, భీమవరం, వీరవాసరం & నరసాపురం అర్బన్ పూర్ ప్రోగ్రెస్లో ఉన్నాయన్నారు.
ఏపీ నాన్ రెసిడెంట్ మోడ్యుల్ వివరాలు అప్డేట్ చేయించాలని ఆదేశించారు.
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు గ్రామ, వార్డు సచివాలయల సిబ్బంది అందరితో తగు చర్యలు తీసుకొని సర్వేలను త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
గూగుల్ మీట్ లో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.