Close

జిల్లాలో కూరగాయల సాగుకు రైతులను గుర్తించి అమలు పరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు.

Publish Date : 18/12/2024

బుధవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పంటల మార్పిడి విధానంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో గుర్తించిన కౌలు రైతులు అందరికి పంట రుణాలు ఇప్పించి ప్రధానమంత్రి పసల బీమా యోజన కింద రైతులని నమోదు చేయాలని అన్నారు. గ్రామ సభలు నిర్వహించి రైతులను చైతన్య పరచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంట మార్పిడి కింద ప్రతి మండలంలో కనీసం 25 ఎకరాలలో కూరగాయల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. పంటల సాగులో డ్రోన్స్ వినియోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దాని వలన కలిగే ఆర్థిక లాభాలు గురించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పంటలపై చీడ, పీడలను సమర్ధవంతముగా ఎదుర్కొనేందుకు నిర్దేశించిన యాప్ లను వినియోగించి రైతులుకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, నాణ్యమైనవి రైతులకు అందజేయాలన్నారు. జిల్లాలోని అన్ని దుకాణాలలో విస్తృతస్థాయి తనిఖీలు చేసి, నమూనాలు సేకరించి నాణ్యతలేని పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు అమ్మే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన పంటను ఈ పంటలో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. వాస్తవ సావుదారుని మాత్రమే నమోదు చేసే విధంగా చూడవలసిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులు పై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్.దేవానంద కుమార్,
వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె ఎస్ ఎస్ శ్రీనివాస్, హరిప్రసాద్, మురళీకృష్ణ, రమేష్, అనిల్ కుమారి, పి.శ్రీనివాస్, పార్వతి, జిల్లాలోని మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ టెక్నికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.