జిల్లాలో ఎస్సీ కుల గణనపై జాబితా ప్రకటనకు జనవరి 17 వరకు పొడిగించడం జరిగిందని, జనవరి 7 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని జరుగుతోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
ఎస్సి జనాభా, వారి వివరాలు.. పేరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, వయసు, ఉపకులం, మరుగుదొడ్డి సౌకర్యం, తాగునీటి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాల పై సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటిలలోని గ్రామ, వార్డు సచివాలయములలో నోటీసు బోర్డు నందు షెడ్యూల్ కులాల వారి జాబితాను డిసెంబర్ 26వ తేదీన ప్రకటించడం జరిగిందన్నారు. తదుపరి మార్పులు, చేర్పులకు అభ్యంతరాలను జనవరి 7 వరకు వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. షెడ్యూల్ కులంకు సంబందించిన వారు వారి వివరాలను సచివాలయాలలో పబ్లిష్ చేయబడిన జాబితాను పరిశీలించుకోవాలని తెలిపారు. అర్జీలు ఆధారంగా ఆన్లైన్ చేయుట, మార్పులు, చేర్పులు వివరాలు వెరిఫికేషన్ చేయుటకు జనవరి 11, 2025 వరకు గడువుగా నిర్ణయించడం జరిగిందన్నారు. మార్పులు, చేర్పులు అనంతరం కులం వారిగా జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో జనవరి 17వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. డేటాపై అభ్యంతరాలను వీఆర్వో స్వీకరిస్తారని, వీటిని మూడు దశల్లో తనిఖీ చేస్తారని తెలిపారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్వో పరిశీలించి వివరాలను సంబందిత రెవిన్యూ అధికారికి నివేదిస్తారని ఆమె తెలిపారు. వీటిని పునఃపరిశీలించి తహసీల్దారుకు సిఫారసు చేస్తారని, తహసీల్దారు, వీఆర్వో నివేదికలోని వివరాలు పరిశీలించి, తుది ఆమోదం తెలిపి ఆ వివరాల్ని పోర్టల్లో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు.