Close

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి. …జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 27/11/2025

గురువారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలోజిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులు కేసిహెచ్ పెద్దిరాజు, ఎం.నరేష్, కె.రాజశేఖర్, కొల్లు దొరబాబు, జగపతిరామయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలన్నారు. ముందుగా గత సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న కార్యాచరణ పై సమీక్షించారు. కమిటీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 2024 నుండి మే 2025 వరకు బాధితులకు 1,85,75,000 మోనిటరీ రిలీఫ్ కింద చెల్లించడం జరిగింది అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ నమోదులో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీఎస్పీ లను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టి అట్రాసిటీస్ సంబంధించి మే,2025 నుండి అక్టోబర్ 2025 వరకు నరసాపురం సబ్ డివిజన్లో 2, భీమవరం సబ్ డివిజన్లో 4, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లో 8 కేసులు మొత్తం 14 కేసులు నమోదయ్యాయి అన్నారు. సంబంధిత కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ దశలో 6,25,000, చార్జి షీట్ దశలో ఒక లక్ష రూపాయలు బాధితులకు అందించడం జరిగిందన్నారు. నూతనంగా నియమితులైన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎస్సీ, ఎస్టీ అట్రాసి టీ సంబంధించిన చట్టాలు గురించి అవగాహన పరుచుకొని వారి సంక్షేమం కోసం సమర్ధవంతంగా సేవలందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.

అనంతరం మాన్యుయల్ స్కామింజర్స్ గురించి మాట్లాడుతూ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ లేరన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం అందించే వినియోగ సామాగ్రిని పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలన్నారు. వీటి వినియోగంలో పారిశుద్ధ్య కార్మికులు అశ్రద్ధ వహిస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు వారికి అవగాహన కల్పించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టి పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించేందుకు శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవోలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దాసిరాజు, ఖతీబ్ కౌసల్ భానో, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణకుమారి, నర్సాపురం డి.ఎస్.పి డా. జి.శ్రీ వేద, తాడేపల్లిగూడెం డిఎస్పి డి.విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి, బీసీ సంక్షేమ అధికారి ఎ.వి. సూరిబాబు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి.పుష్ప రాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.