జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, డీఆర్ ర్డిఏ, డిపిఓ, ఫిషరీస్, జి ఎస్ డబ్ల్యూ ఎస్, సిపిఓ, కార్మిక శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని ఎంపీడీవోలతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా పల్లె పండుగ కార్యక్రమంలో 2024 – 25 సంవత్సరంలో మంజూరైన మినీ గోకులం క్యాటిల్ షెడ్ ల నిర్మాణాలను వారం లోపుగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 2025 – 26 సంబంధించి కొత్త క్యాటిల్ షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో హార్టికల్చర్ ప్లాంటేషన్ 350 ఎకరాల్లో చేపట్టాల్సి ఉండగా 250 ఎకరాల్లో ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 50 ఎకరాల్లో కూడా హార్టికల్చర్ ప్లాంటేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు అర్హత కలిగిన ప్రతి ఇంటికి కంపోస్ట్ పిట్ ను పూర్తిచేయాలని తెలిపారు. జిల్లాలో 1,86,980 జాబ్ కార్డులు ఉండగా, 3,08,329 మంది శ్రామికులు ఉన్నారన్నారు. 2024 25 ఆర్థిక సంవత్సరంలో వేతనాలు కింద రూ.101.18 కోట్లు, సామాగ్రి కింద రూ.44.82 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. జాబ్ కార్డ్ లు ఈకేవైసీ సెప్టెంబర్ 30 లోపుగా పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మ్యాజిక్ డ్రైన్ ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు అందరూ పిట్లను ఏర్పాటు చేసుకోవాలని, డ్రైనేజీల్లో పైపులను పెట్టకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. బగ్గేశ్వరం, వీరవాసరం, రేలంగి తదితర హైవే రోడ్డు మార్జిన్ లో ఎక్కువగా చెత్తను డంపు చేస్తున్నారని, చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డంపింగ్ యార్డు సమస్య ప్రధానంగా ఉందని పొడి చెత్త, తడి చెత్త వేరు చేయకపోతే డంపింగ్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అన్ని కలిపి డంపింగ్ చేయడం వలన దుర్వాసన, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇంటింటి చెత్త సేకరణలో తప్పనిసరిగా తడి, పొడి చెత్త లను వేరువేరుగా సేకరించాలన్నారు. అభివృద్ధి చెంది, విజ్ఞానం కలిగిన జిల్లాలో ఓపెన్ యూరినేషన్ ఎక్కువగా ఉందని, ఇది సరైన నాగరిక చర్యకాదని, మన సంస్కృతిలో భాగంగా ఎక్కడపడితే అక్కడ ఓపెన్ యూరినల్స్ చేయవద్దని సూచించారు. పరిశుభ్రత అనేది కంటికి కనిపించే అంతగా శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరం ఉన్న అన్ని కార్యాలయాలు ప్రతిపాదలను సమర్పించాలని ఆదేశించారు. ఇంకా మిగిలి ఉన్న ఓ హెచ్ ఆర్ ట్యాంకుల మెట్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, త్రాగునీటి వనరులను నిర్ణీత సమయంలో తనిఖీ చేసి వాస్తవ నివేదికలను ఆన్లైన్ చేయాలన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమిత్వ సర్వేలో నరసాపురం ప్రాంతంలోని కొన్ని మండలాలు వెనుకబడి ఉన్నాయని, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జేజేయంలో నీటి సరఫరా చేస్తున్న గృహాల నుండి వాటర్ టాక్స్ ను పెండింగ్ లేకుండా వసూలు చేయాలన్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని, గుర్తించిన వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. పి4 లో భాగంగా బంగారు కుటుంబాలతో దాతల అనుసంధాన ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కౌశలం సర్వే లక్ష్యం మేరకు ఇంకా పూర్తి కాలేదని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం జీఎస్టీ క్యాంపెయిన్ నిర్వహించడానికి సంకల్పించడం జరిగిందని, ఆయా శాఖలలో జీఎస్టీ మార్పులను ప్రచారంలో భాగంగా చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన జీఎస్టీ క్యాంపెయిన్స్ ను గుర్తించాలని సూచించారు. ఆక్వాజోనైజేషన్ ప్రక్రియ చాలా వరకు పూర్తయిందని, సర్వేలో ఇంకా మిగిలి ఉన్న వాటిపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ప్రతి చెరువుకు ఈ ఫిష్ నమోదు తప్పనిసరి అని, ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. ఏపీ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ లో ఎన్ఆర్జిఎస్ వర్కర్స్ ను కూడా నమోదు చేయడానికి ప్రభుత్వం ఆదేశించిందని, వీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండానే అప్లికేషన్ పూర్తిచేసి నమోదు కావచ్చని, ఎంపీడీవోలు ఈ విషయమై శ్రద్ధ పెట్టాలన్నారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మరణం లేక వైకల్యం కలిగితే భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలు వీరికి వర్తిస్తాయని, పిల్లల వివాహానికి, మట్టి ఖర్చులు కూడా నగదును అందజేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి ఆధార్ కార్డు, జాబ్ కార్డ్, నామినేషన్ వివరాలను అందజేయాల్సి ఉంటుందన్నారు. పిఎం జె జె బి వై, పీ ఎం ఎస్ బి వై బ్యాంకు అకౌంట్లకు అనుసంధానంగా బీమా పథకాల్లో తక్కువ ప్రీమియం చెల్లించి అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబానికి ఆసరాగా నిచేలా పెద్ద మొత్తాన్ని పొందవచ్చు అని, ఈ బీమా పథకాల్లో ప్రతి ఒక్కరూ నమోదయి ప్రీమియం చెల్లించాలన్నారు. గుర్రపు డెక్క ద్వారా కంపోస్ట్ తయారీకి డ్వాక్రా మహిళలు జిల్లాలో భీమవరం, ఆకువీడు, పాలకోడేరులో యూనిట్లను ప్రారంభించి వినియోగం లోనికి తీసుకురావడం జరిగిందని, మండలానికి మూడు యూనిట్లు చొప్పున లక్ష్యంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డ్వామా పి.డి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, జిల్లా జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి వై.దోసి రెడ్డి, డిపిఓ ఎం.రామ్ నాథ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, సిపిఓ కె.శ్రీనివాసరావు, మత్స్య శాఖ ఏడి ఎల్ ఎల్ ఎన్ రాజు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, ఎంపీడీవోలు, ఎన్ ఆర్ జి ఎస్ ఫీల్డ్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.