Close

జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పని దినాల కల్పనకు కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 04/04/2025

గురువారం మొగల్తూరు మండలం వారతిప్ప మురుగు కాలువ నందు ఉపాధి హామీ కూలీల ద్వారా జరుగుచున్న కిక్కిస తొలగింపు పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్తర్ రిజిస్టర్ను పరిశీలించి ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని రోజులు పని కల్పించారు, ఎన్ని గంటలకి పనికి హాజరవుతున్నారు, తదితర వివరాలను తెలుసుకొని హాజరను స్వయంగా పిలిచి పనికి వచ్చిన వారి హాజరుని నిర్ధారణ చేసుకున్నారు. ఈ సందర్భంలో కొందరు కూలీలు మాట్లాడుతూ వ్యవసాయ పనులు లేవని, వయస్సు కారణంగా వ్యవసాయ పనులు కూడా చేయలేకపోతున్నామని ఉపాధి హామీ పనులు కల్పించడం వలన మాకు పని దొరుకుతుందని చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ వద్ద ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జాబ్ కార్డ్ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించడం లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. వారతిప్ప డ్రైన్ కిక్కస తొలగింపు పనుల నిమిత్తం 537 పని దినాలను కల్పించడం జరిగిందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా పని ప్రదేశాలలో ఓఆర్ఎస్ తోపాటు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. త్రాగునీరు, మజ్జిగ అందించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. పని కోరిన వారికి తప్పకుండా పనిని కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు. వారతిప్ప వాడకం నీటి చెరువు నందు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని కొంతమంది ఉపాధి హామీ కూలీలు కలెక్టర్ తెలియజేయగా పరిశీలించి వెళ్తానని బదులిచ్చారు.

అనంతరం వారతిప్ప వాడకం నీటి చెరువును స్వయంగా పరిశీలించి ఎంపీడీవోతో మాట్లాడారు. వంతుల వారి విధానం వలన నేటి నుండే నీటిని నింపడం జరుగుచున్నదని, వాడకం నీటికి ఇబ్బంది ఉండదని తెలిపారు.

ఈ సందర్భంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ డా.కేసిహెచ్ అప్పారావు, మొగల్తూరు తహాసిల్దార్ కె.రాజ్ కిషోర్, ఎంపీడీవో సిహెచ్ త్రిశూల పాణి, డ్వామా అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.