Close

జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేతుల మీదుగా అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 25/01/2026

జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ కె.విజయానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్ల నమోదుకు తీసుకున్న ఉత్తమ చర్యలను గుర్తిస్తూ ఎంపిక చేసిన “ఉత్తమ ఎన్నికల విధానాల అవార్డు – 2025” ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చదలవాడ నాగరాణి అందుకున్నారు. మొత్తం 12 జిల్లాలను వివిధ అంశాలలో ఎంపిక చేయగా, అత్యధిక ఓటర్ల నమోదు విభాగంలో ఒక్క పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల అధికారిని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది.

ఈ రోజు సందర్భంగా జిల్లా కలెక్టర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది అభినందించిన వారిలో ఉన్నారు.