Close

జిల్లాలో అగ్నిమాపక నిరోధాలకు గట్టి చర్యలు చేపట్టాలని, ఎక్కడ ముందు గుండు సామాగ్రి తయారీ జరగకూడదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

Publish Date : 21/01/2026

భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అగ్నిమాపక శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో మందు గుండు సామాగ్రి తయారీకి ఏ ఒక్కరికి అనుమతులు లేవని, ఎవరైనా తయారుచేసినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అగ్నిమాపక నిరోధానికి ప్రతి నెల ఒక కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సేవలపై ప్రజలలో మంచి స్పందన కనిపించాలని, ఏదైనా డబ్బులు వసూలుకు పాల్పడినట్లు ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు ఏడు ఫైర్ ఇంజన్లు ఉన్నాయని, జిల్లాకు అదనంగా మరో రెండు కొత్త ఫైర్ ఇంజన్ లు మంజూరయ్యా అని తెలిపారు. వాటిలో ఒకటి భీమవరం, మరొకటి పాలకొల్లుకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. పరిశ్రమలు, హాస్పిటల్స్, స్కూల్స్, పెట్రోల్ బంక్స్, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లో తదితర నిర్మాణాలకు అన్నింటికీ తప్పకుండా ఫైల్ సేఫ్టీ ఉండేలా చూడాలని ఆదేశించారు. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా మంచి కండిషన్లో ఉంచుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అగ్నిమాపల శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, ఏడు నియోజకవర్గాల సహాయ అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.