జిల్లాలోని వ్యవసాయ ఆధారిత భూములలో ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా “పచ్చిరొట్ట ఫైర్లకు వాడడం ద్వారా చేకూరే ప్రయోజనాలపై” గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అధిక ఎరువులు వినియోగం కారణంగా భూసారం దెబ్బతిని జీవం కోల్పోవడంతో భూమి సాగుకు పనికి రాకుండా పోతుందన్నారు. పచ్చిరొట్ట పైర్లను వాడడం ద్వారా 25% ఎరువులను ఆడా చేసుకోవచ్చు అన్నారు. పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం వస్తుంది అన్నారు. వర్షాకాలానికి ముందు పొడి విత్తనాలను వెదజల్లడం ద్వారా పచ్చి రొట్టె ఎరువులు పొందవచ్చు అన్నారు. నేలసారం పెంపు, ఆరోగ్యకరమైన నేల, పోషకాలు వృధా తగ్గుతుంది అన్నారు. సాగు ఖర్చులు తగ్గిస్తుందని తెలిపారు. జీవన ఎరువులు వినియోగిస్తే 10 శాతం ఎరువులు హాజరు చేయవచ్చని, జీవన ఎరువులు వినియోగంతో పంటకు బలం చేకూరుతుందన్నారు. రైజోబియం, ఆజోటోబాక్టర్, బ్లూ గ్రీన్ ఆల్గే, అజోల్లా, మైకోరైజా వాతావరణ నత్రజనిని మట్టిలో నిలిపి నత్రజని ఎరువులు మొక్కకు ఉపయోగపడతాయన్నారు. అలాగే ఫాస్ఫరస్ కరిగించే ఎరువులు, పోటాస్ కరిగించే ఎరువులు నేలలోని పోషకాలను కరిగించి పంటకు అందిస్తాయన్నారు. బయో ఫెర్టిలైజర్స్ ను 6 నుండి 12 నెలల కాల పరిమితి లోపు వినియోగించాలని, రసాయనికి ఎరువులు కీటకనాశనాలతో కలిపి వేయకూడదని, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడటం మంచిదని తెలిపారు. రైతులు పచ్చరొట్ట, బయో ఫెర్టిలైజర్స్ ను వినియోగించి భూసారాన్ని పెంపొందించుకోవాలన్నారు.
గోడ పత్రికను ఆవిష్కరించిన సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, డ్వామా పి.డి కేసిహెచ్ అప్పారావు, తదితరులు ఉన్నారు.