జిల్లాలోని రైతులు అధిక ఆదాయం పొందేందుకు పూల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

బుధవారం జువ్వలపాలెం రోడ్డు ఆనంద ఇన్ హౌటల్ నందు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి పూలసాగు మరియు ఉద్యాన విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన సదస్సు లో రైతులకు శిక్షణ తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత పూల ప్రదర్శనను తిలకించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సింగపూర్, మలేషియా దేశాలతో పాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, రాయలసీమ, కడియం పూల సాగుకు ప్రసిద్ధిగాంచడంతోపాటు, అక్కడి రైతులు అధిక లాభాలను ఆర్టిస్తున్నారు అన్నారు. జిల్లాలో ఎక్కువ నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలను గుర్తించి పూల్ మకాన్ సాగుకు దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పెనుగొండ, సిద్ధాంతం ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారని, అలాగే జిల్లాలో పువ్వుల సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి రైతులను అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. పూల సాగుకు ప్రాథమిక పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్న పువ్వులు కోతకు వస్తే అధిక ఆదాయాన్ని పొందుతారన్నారు. పూల సాగుకు పెట్టుబడిగా టర్మ్ లోన్స్ 5 సంవత్సరాలు అనంతరం చెల్లించేలా అందజేయడం జరుగుతుందని, అలాగే నా బార్డు, డిఆర్డిఏ రుణాలుతో పాటు, ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా మల్లె తోట సాగుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. డెకరేటివ్ ఫ్లవర్స్ కు దేశ, విదేశాలలో మంచి గిరాకీ ఉందని, పెరవలి మండలం కాపవరంలో ఐదు ఎకరాలలో ఆర్కిడ్ ఫ్లవర్స్ సాగు విజయవంతంగా చేస్తున్నారని, నేను కూడా స్వయంగా పరిశీలించడం జరిగిందన్నారు. ఒక్కొక్క పువ్వు సుమారు రూ.30/- నండి రూ.150/- వరకు ధర పలుతోందని, అంతకన్నా ఎక్కువ ధర పలికే పువ్వులు కూడా ఉన్నాయన్నారు. పాలి హౌస్ షేడ్స్ లో ఈ పువ్వుల సాగును చెప్పటాల్సి ఉందన్నారు. పూలు సాగుకు తక్కువలో తక్కువ 10 సెంట్లు నుండి ఒక ఎకరం వరకు సాగు చేసుకోవచ్చని, దశల వారి సాగును పెంచుకోవచ్చని తెలిపారు. రైతులకు ఎక్స్పోరర్ విజిట్స్ ను ఏర్పాటు చేయాలని, రైతులను కలిసి అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. పువ్వులు సాగు అధిక ఆదాయంతో పాటు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుగచేస్తాయని, సాగుదారులకు సంతృప్తినిస్తాయన్నారు. ప్రపంచంలో పూల సాగులో భారతదేశం రెండవ స్థానంలోను, చైనా మొదటి స్థానంలోను ఉన్నాయన్నారు. మన దేశంలో 2,85,000 హెక్టార్లలో పూల సాగు జరుగుతుందన్నారు. ప్రపంచంలో 35 శాతం పూల సాగు భారతదేశంలో ఉన్నదని తెలిపారు. తమిళనాడులో 21%, కర్నాటకలో 16%, ఆంధ్రప్రదేశ్ 14% పూల సాగు చేస్తున్నారన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ 19,000 హెక్టార్లలో పూల సాగు చేస్తూ 3 వ స్థానంలో ఉన్నదన్నారు. జిల్లాలో ప్రస్తుతం పూల సాగును రైతులు తక్కువ స్థాయిలో చేపట్టడం జరిగిందని, మన జిల్లా వాతావరణం, నేలలు, పుష్కలమైన సాగునీరు పులసాగుకు అనువైనవన్నారు. ప్రభుత్వము పెద్ద ఎత్తున పూలసాగును ప్రోత్సహిస్తున్నదన్నారు. మన జిల్లాలో 2 లక్షల హెక్టార్లు సాగు భూమిలో 1.20 లక్షల హెక్టర్లు వరి సాగు ఉన్నది. 50,000 హెక్టార్లలో ఆక్వా చెరువులు ఉన్నాయని తెలిపారు. ఇతర వ్యవసాయ పంటలు పోను 15,000 హెక్టార్లలో మాత్రమే ఉద్యాన పంటల సాగు ఉన్నదన్నారు. జిల్లాలో రైతులు అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు పంట మార్పిడి చేయాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల కొరకు సాగు భూమి లభ్యత తక్కువ ఉన్న కారణంగ తక్కువ విస్తీర్ణంలో చేపట్టి పాలి హౌస్ విదానం ద్వారా హై వాల్యూ క్రాప్స్ ని పండించాలని సూచించారు. పాలి హౌస్ సాగులో బహిరంగ సాగు కంటే మూడు రేట్లు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదన్నారు. పాలి హౌస్ ద్వారా క్యాప్సికమ్, బ్రిటిష్ కుకుంబర్, జెర్బరా, ఆర్కిడ్ వంటి అధిక విలువ గల కూరగాయలు మరియు పూల సాగును చేపట్టి లాభాలను పొందవచ్చు అన్నారు. పాలి హౌస్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 50% రాయితీగా గరిష్టంగా ఎకరానికి రూ.16.00 లక్షల రాయితీ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. పాలి హౌస్ లో పూలు మరియు కూరగాయల పంటల సాగుకు ఎకరానికి గరిష్టంగా రూ.5.00 లక్షల రాయితీ సదుపాయం వుందని తెలిపారు. అవకాశాన్ని అభ్యుదయ రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
తొలుత పూల సాగు పై కెవికె హెడ్ డా.మల్లికార్జున్, డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరి కల్చర్ డాక్టర్ డివిఎస్ రాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.లలిత కామేశ్వరి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు జిల్లాలో పూల సాగుకు ఉన్న అవకాశాలు, దేశ విదేశాల్లో మార్కెటింగ్ వంటివాటిపై కార్యక్రమంలో వివరించారు.
ఈ సదస్సులో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్ దేవానంద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, నాబార్డ్ డీడీఎం టి.అనిల్ కాంత్, ఉండి కెవికె హెడ్ అండ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జున్, కడియం మండలం వేమగిరి రీజనల్ సెంటర్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లోరి కల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ డివిఎస్ రాజు, హార్టికల్చర్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ బి.హరినాథ్ రెడ్డి, కొవ్వూరు హార్టికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.లలిత కామేశ్వరి, సైంటిస్ట్ డాక్టర్ వి.శివకుమార్, వేమగిరి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రాంపాల్, రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.