జిల్లాలోని మహిళలు గుర్రపు డెక్క ద్వారా వర్మి కంపోస్ట్, వివిధ వస్తువులు తయారుచేసి, మార్కెటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని, దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు

శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వంతెన వద్ద డ్రైన్ లో గుర్రపు డెక్కను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న మహిళలతో గుర్రపు డెక్కను ఎలా సద్వినియోగం చేయవచ్చు, ఆదాయాన్ని ఎలా పొందవచ్చు వివరించారు. గుర్రపు డెక్క కారణంగా సాగునీటి ప్రవాహానికి అంటంకంగా ఉండటంతో వరదలు సమయంలో జిల్లాలోనీ వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. దీనిని నివారించేందుకు ఆలోచనచేసి గుర్రపు డెక్కను వినియోగించి వర్మీ కంపోస్ట్, ప్రత్యామ్నాయ వస్తువులు రూపొందించేందుకు డీఆర్డీఏ, వ్యవసాయ శాఖలను సన్నాహక చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. చాప్ కట్టర్స్ తో గుర్రపు డెక్కను ముక్కలుగా కట్ చేసి తొలిదశలో వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వర్మీ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలన్నారు. ప్రతి సంవత్సరం గుర్రపు డెక్క నిర్మూలనకు కోట్లాది రూపాయలు నీటిపారుదల శాఖ ఖర్చు చేయడం జరుగుచున్నదన్నారు. దీనికి చాలా విషపూరితమైన మందులను వినియోగించడం జరుగుచున్నదని, దీని కారణంగా సాగు, త్రాగు నీటి వనరులు పెద్ద ఎత్తున కలుషితం అవుతున్నాయని, తద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు, జంతువులకు, జలచరాలకు నష్టం జరుగుతుందన్నారు. గుర్రపు డెక్కను సద్వినియోగం చేసుకోవడం ద్వారా జిల్లాను వరదల నుండి రక్షించుకోవడంతో పాటు, ప్రభుత్వానికి కోట్ల రూపాయలు అధాతో పాటు, అలాగే ప్రజలు, జల చరాలుకు మేలు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఆర్థిక వనరుగా మార్చుకునేందుకు మహిళలు ముందుకు రావాలన్నారు.
ఈ సందర్భంలో డీఆర్డీఏ పిడి ఎమ్ ఎస్ ఎస్ వేణుగోపాల్, తహాసిల్దార్ విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ రామ్ ప్రసాద్, ఇరిగేషన్ ఎ.ఈ వెంకటేశ్వరరావు, మహిళలు, తదితరులు ఉన్నారు.