జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో అక్టోబర్ 2 నుండి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి–జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి.
పిజిఆర్ఎస్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డా.కెసిహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈసందర్బంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 194 అర్జీలు అందాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కావున, పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు.
ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ కు బ్యాంకు రుణాలు మంజూరు, అత్యవసర వైద్య సేవలు, పింఛన్లు మంజూరు, ఇళ్ల స్థలాల కేటాయింపు, వికలాంగ పెన్షన్లు మంజూరు వంటి అనేక సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారని వాటిని పరిష్కరించడం జరుగుతోందన్నారు. సమస్యల పరిష్కారం ద్వారా లబ్ది చేకూరిన లబ్ధిదారుల నుండి స్పందన సేకరించి ప్రజలకు తెలియజేస్తే పీజీఆర్ఎస్ పై మరింత నమ్మకం కలుగుతుందన్నారు. ఈ దిశగా ప్రయత్నం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అక్టోబర్ 2వ తేదీ నుండి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ను వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
అనంతరం స్వమిత్వ, ఈ పి టి ఎస్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. స్వమిత్వ సర్వేను వేగవంతం చేసి ఈ నెల 27వ తేదీ నాటికి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పి టి ఎస్ వెబ్సైట్లో కార్యాలయాలలోని డాక్యుమెంట్లు అప్లోడింగ్ ప్రక్రియపై జిల్లా అధికారులు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి దస్త్రాల అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ఈరోజు పిజిఆర్ఎస్ కు అందిన ఫిర్యాదులలో ముఖ్యమైనవి కొన్ని ఈ విధంగా ఉన్నాయి.
@ ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన వడ్లమూడి గీత అర్జీని సమర్పిస్తూ, తన పేరున ఇల్లు బంగారం, డబ్బు ఉందని, హార్ట్, బ్రెయిన్ సమస్య కారణంగా తన బాధ్యత సోదరి శ్రీలక్ష్మికి పెద్దలు అప్పగించడం జరిగిందన్నారు. తన తదనంతరం ఇల్లు బంగారం, డబ్బు తన సోదరి తీసుకునే విధంగా పెద్దలు నిర్ణయించారు అన్నారు. తనకు చదువు రానందువల్ల నా సోదరి నా ఇంటిని రాయించుకుని తనను బయటికి గెంటి వేసిందని, తనకు న్యాయం చేయాలని కోరారు.
. @ పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన బి.సాంబశివరావు అర్జీని ఇస్తూ తనకు కంటి చూపు లేదని తనకు ఎటువంటి జీవనాధారం లేదని వృద్ధాప్య పింఛన్ కావాలని కోరారు.
. @ పెంటపాడు మండలం మోంజిపాడు గ్రామానికి చెందిన నక్క వెంకన్న అర్జీనిస్తూ, తన కుమారుడు, కుమార్తె కె.పెంటపాడు జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నారని, ఇంతవరకు తల్లికి వందనం పథకంలో సొమ్ము జమ కాలేదని, తన ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యే విధంగా చూడాలని కోరారు.
. @ పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన కంటమని ఝాన్సీ అలివేలు తాను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని, అద్దె ఇంటిలో ఉంటున్నానని తనకు ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.
@ వీరవాసరం మండలం కొణితవాడ గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి వంశీ అర్జీని సమర్పిస్తూ, తాను వికలాంగుడునని కొణితవాడలో ఖాళీగా ఉన్న రేషన్ షాపును మంజూరు చేయాలని కోరారు.
@ భీమవరం మెంటేవారి తోటకి చెందిన సిహెచ్.శ్రీదేవి అర్జీని సమర్పిస్తూ, నా కుమారుడు మానసిక వికలాంగుడని, ఆన్లైన్ ద్వారా వికలాంగత్వ సర్టిఫికెట్ ఇప్పించి తన కుమారునకు వికలాంగ పించను మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల ట్రిపునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, , తదితరులు పాల్గొన్నారు.