Close

జిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాదులను ఏర్పాటు చేయటంతో పాటు, పొదుపు చేయడంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Publish Date : 28/03/2025

శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇటీవల అమరావతిలో జరిగిన ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో జిల్లాకు సంబంధించి ప్రస్తావించిన అంశాలపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాదులను ఏర్పాటుచేసి, సంపాదనను పొదుపు చేసుకోవడం ఎలాగో పూర్తి అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. మహిళా గ్రూపులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ రణాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కొంతమంది భవిష్యత్తు అవగాహన లేక పొందిన రుణాలతో విలాసవంతమైన వస్తువులను కొనడం, వాటిని తీర్చడానికి మళ్లీ అప్పులను అప్పులను చేయడం జరుగుతుందన్నారు. ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆడంబరాలకు పోకుండా ఖర్చు చేయడం అలవాటు చేసుకుంటే, పొదుపు వలన భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివించాలని ఎక్కువ డబ్బును ఫీజులు రూపేనా చెల్లించి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇంజనీరింగ్ వంటి కోర్సులు కన్నా ఐటిఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు తక్కువ ఖర్చుతో పూర్తి అవడమే కాకుండా, ఉద్యోగ అవకాశాలు నూరు శాతం ఉన్నాయని ఈ విషయమై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, డి ఆర్ డి ఏ, పరిశ్రమలు, డ్వామా, మున్సిపల్ శాఖలలో జరుగుచున్న కార్యక్రమాలపై ప్రధానంగా ప్రస్తావించారు. వ్యవసాయం, హార్టికల్చర్ వేస్టేజ్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేయాలన్నారు. కొబ్బరి పీచు ద్వారా బై ప్రొడక్షన్ తయారుచేసి మార్కెటింగ్ కు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. కోనసీమలో ఉన్న కోకోనట్ బోర్డుకు కొబ్బరి రైతులను తీసుకొని వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు నవధాన్యాలతో మూడోవ పంటను వేసి భూసారాన్ని పెంపొందించేలా చూడాలన్నారు. 25 శాతం ప్రజలు స్థానికంగా వినియోగించే ధాన్యము రకాలను పండించాలన్నారు. గేదెలు, ఆవులు ద్వారా వచ్చే పేడను కంపోస్ట్ గా వినియోగించి, తద్వారా వాటి యజమానులకు ఆదాయం సమకూర్చాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ కాటిల్ షెడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా అధికారిని ఆదేశించారు. ఎంతమందికి పశువులు ఉన్నాయి, ఇంకా ఎంతమందికి పశువులు అవసరం వివరాలను సేకరించి అవసరమైన వారికి పశువులను అందజేసేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. సరైన రీతిలో జిల్లాలో గుర్రపు డెక్క నుండి వర్మీ కంపోస్ట్, తదితర వస్తువులను రూపొందించడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. హోటల్స్ ఫంక్షన్ హాల్స్ లో పెద్ద మొత్తంలో వచ్చే వేస్ట్ ను డిస్పోస్ చేసేలా వారు వద్దనే కంపోస్ట్ ఫిట్స్ ను ఏర్పాటు చేసుకునేలా తీర్మానించి సదరు యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు. వేసవి వేడి గాలుల నుండి ప్రజలు రక్షణ పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. రైస్ మిల్లర్స్ బాయిలర్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసేలా చూడాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉందని, జిల్లాలో పెద్ద మొత్తంలో పోలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్ నిర్మాణాలకు ఎంటర్ పెన్యూర్స్ ను ప్రోత్సహించాలన్నారు. తద్వారా నాణ్యమైన ఫలాలు, కూరగాయలు, పువ్వులు ఉత్పత్తికి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఏ పి డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీఎవో జెడ్.వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి దేవేంద్ర కుమార్, డ్వామా పిడి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, పరిశ్రమ శాఖ అధికారి యు.మంగపతి రావు, సిపిఓ కే.శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ డిడి డాక్టర్ జవ్వార్ హుస్సేన్, జిల్లా కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మి, జిల్లా చేనేత, జౌలి శాఖ అధికారి అప్పారావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.