జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలపై తక్షణమే నివేదిక అందించాలి–జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవు.
ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు అధ్యయనం చేసి ఫిర్యాదు దారు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలి
గురువారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పిజిఆర్ఎస్, రీ సర్వే, ఇళ్ల స్థలాలు, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, రెవెన్యూ అంశాల ప్రగతిపై, డిఆర్ఓ, ఆర్డీవోలు, తహసిల్దార్లు, సర్వేయర్లుతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ సమస్యల పరిష్కారంపై ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదుదారుల నుండి సేకరించిన స్పందనపై ఫిర్యాదుదారులు సంతృప్తి స్థాయి చాలా తక్కువగా ఉందని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. కొంతమంది తహసిల్దారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఫిర్యాదుల పరిష్కారంపై పురోగతి లేకపోతే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జాయింట్ ఎల్పిఎం, మ్యుటేషన్ సంబంధించిన పెండింగ్ కేసులను విచారణ చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసిల్దారులను ఆదేశించారు. రీ సర్వేలో భాగంగా ఇళ్ల స్థలాలు, పంట పొలాలు సరిహద్దు కొలతల నిర్ధారణలో హెచ్చుతగ్గులపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి ఇటువంటి సమస్యలను సత్కారమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ అంశాల ప్రగతిపై కూడా ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని ఆర్డీవోలు, తహసిల్దారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత సమస్యల పరిష్కారానికి శ్రద్ధచూపాలన్నారు. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆయా ఇసుక స్టాక్ పాయింట్లలో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయో సత్వరమే సంబంధిత తాసిల్దార్లు స్టాక్ పాయింట్లను సందర్శించి నివేదికల పంపాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
ఈ గూగుల్ మీట్లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, భీమవరం ఆర్డిఓ కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, నరసాపురం ఆర్డిఓ దాసిరాజు, తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతిబ్ కౌసర్ భానో, తహాసిల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.