జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు యోగ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
జిల్లాలోని అన్ని ప్రాంతాలలో జూన్ 21న ఒకే సమయంలో యోగా కార్యక్రమాలు..
జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ నందు 5 వేల మందితో మెగా యోగాకు భారీ ఏర్పాట్లు..
జిల్లాలో 8 లక్షల 80 వేల మంది యోగ రిజిస్ట్రేషన్లు, 4,835 ప్రదేశాలలో యోగా నిర్వహణ..
యోగా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగే విధంగా మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
జిల్లావ్యాప్తంగా జూన్ 21 శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. రేపు శనివారం నిర్వహించే యోగా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా జరిగే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 8.80 లక్షల మంది శనివారం నిర్వహించే యోగా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చూడాలన్నారు. యోగ నిర్వహించే ప్రతి లొకేషన్ లో యోగాంధ్ర బ్యానర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నంలో భారత ప్రధాని శనివారం ఉదయం 7.00 నుండి 8.00 గం.ల వరకు యోగా కార్యక్రమంలో పాల్గొంటారని, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యే విధంగా సన్నద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. యోగా కార్యక్రమాలకు హాజరైన వారికి పార్టిసిపేషన్, మూడు రోజులు శిక్షణా తరగతులకి హాజరైన వారికి ఎక్స్లెంట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ఈరోజు సాయంత్రం లోపుగా పూర్తి చేసి, రికార్డును అప్డేట్ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా మండలాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులును ఆహ్వానించి యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాల ఉద్యోగులు అందరూ బాధ్యతాయుతంగా యోగ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేవిధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
భీమవరం కలెక్టరేట్ గ్రౌండ్ లో 5 వేల మందితో యోగ..
అనంతరం భీమవరం కలెక్టరేట్ నందు నిర్వహించే యోగా కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఏర్పాట్లన్నీ పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. వివిధ కళాశాల నుండి విద్యార్థులను తీసుకొస్తున్న బస్సుల పార్కింగ్ ను క్రమ పద్ధతిలో చేయించాలన్నారు. పూర్తిస్థాయిలో త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సిబ్బందిని అవసరమైన మందులతో సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిర్ణీత సమయాని కంటే ముందుగానే విద్యార్థులకు కేటాయించిన స్థానాలకు చేర్చాలన్నారు. పిల్లలను ఉత్సాహ పరిచే విధంగా రోప్ స్కిప్పింగ్, మల్కంబం వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డీఈఓ కు సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శాఖ అధికారి బి.ఉమామహేశ్వరరావు, డీఈవో ఇ. నారాయణ, డిఈఓ ఆఫీస్ ఎడి సత్యనారాయణ, డిస్టిక్ ఇంటర్మీడియట్ అధికారి నాగేశ్వరరావు, డ్వామా పి.డి డాక్టర్ కే సిహెచ్ అప్పారావు, జిల్లా టూరిజం అధికారి ఎ.వి.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.