Close

జాయింట్ ఎల్.పి.ఎంలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు

Publish Date : 26/06/2025

గురువారం పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో జాయింట్ ఎల్.పి.ఎంలు పట్టాదారులుగా నమోదైన భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో జాయింట్ ఎల్.పి.ఎంలు ఎన్ని ఉన్నాయి, వాటి మీద తీసుకున్న చర్యలు గురించి సంబంధిత అధికారులను వివరాల అడిగి తెలుసుకున్నారు. గరగపర్రు గ్రామంలో 439 జాయింట్ ఎ.ఎల్.పి.ఎంలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వివరించగా గ్రామంలో వారానికి రెండు రోజులు ప్రత్యేక క్యాంపులను నిర్వహించి సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి అమ్మ ఒడి, అన్నదాత సుఖీభవ, ప్రభుత్వ పథకాలకు ఇబ్బంది లేకుండా సబ్ డివిజన్ చేయించాలని అన్నారు. జాయింట్ ఎల్ పి ఎం లు కారణంగా పడుతున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ కు రైతులు వివరించగా జాయింట్ ఎల్ పి ఎం లు వలన ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారో వారి సమస్యలపై దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు వారి భూములు విభజన చేసేందుకు నామమాత్రపు దరఖాస్తు రుసుము రూ.50/- లను గ్రామ సచివాలయాల్లో చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా గరగపర్రు గ్రామ సచివాలయమును సందర్శించే రికార్డులను పరిశీలించారు. జాయింట్ ఎల్.పి.ఎం లు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకొని పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గ్రామ సెక్రటరీ, వీఆర్వో, ఆర్ ఐ, సర్వే అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంలో జిల్లా సర్వే ఇన్చార్జి అధికారి కె.శ్రీనివాసరావు, డివిజనల్ సర్వే అధికారి మల్లికార్జునరావు, మండల సర్వే సి.హెచ్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.