Close

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు

Publish Date : 12/12/2025

కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాలు, విద్య, వైద్యం, రవాణా, పరిశ్రమలు, తూనికలు కొలతలు, ఆహార భద్రత సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే నిమిత్తం వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు. వారోత్సవాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు, అవగాహనా సదస్సులపై చర్చించారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్ధ, సత్వర పరిష్కారం అనే నినాదం పై పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులలో అవగాహన కల్పించి అట్టి నినాదం పై పోటీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వ్యాచరచన, వక్రత్వం పోటీలను తెలుగు, ఇంగ్లీష్ భాషలలో నిర్వహించాలని అన్నారు. పోటీలలో ఉత్తీర్ణత సాధించిన మొదటి ముగ్గురు విద్యార్దులకు జిల్లా స్ధాయిలో నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రధమ బహుమతి – రూ.5 వేలు , రెండవ బహుమతి – రూ.3, వేలు మూడవ బహుమతి – రూ.2 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలో మొదటి స్ధానంలో గెలుపొందిన వారిని ఈ నెల 23వ తేదీ నాడు విశాఖపట్నం నగరంలో జరగబోయే రాష్ట్ర స్ధాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఈనెల 18వ తేదీ నుండి 24 వ తేదీ వరకు జరిగే వారోత్సవాలలో భాగంగా, జిల్లాలోని అన్నీ ప్రభుత్వ / ప్రైవేట్ పాఠశాలలలో మరియు జూనియర్ కళాశాలలలో ప్రతిరోజూ అసెంబ్లీ సమయంలో విద్యార్దులతో ప్లెడ్జి మరియు స్లోగన్స్ ప్రతిజ్ఞ చేయించాలని అన్నారు. ఈ వారత్సవాల్లో ప్రజలకు వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే నిమిత్తం వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల సహకారంతో ర్యాలీలు నిర్వహించి అందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో డి ఎస్ ఓ ఎన్ సరోజ, డీఈవో ఇ.నారాయణ,
డి ఎం సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, ఏ ఎస్ ఓ ఎం రవిశంకర్, వివిధ విద్యా సంస్థలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.