జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన -జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు .
భీమవరం బాంబే స్వీట్స్ కూడలిలోని గాంధీజీ విగ్రహం వద్ద దాత బాంబే స్వీట్స్ యాజమాన్యం దాత పొత్తురి బాపిరాజు సొంత ఖర్చులతో చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి లాన్, మొక్కలు ఏర్పాటు, వాటర్ ఫౌంటెన్, పెయింటింగ్, బ్యాక్ డ్రాప్ పనులను గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు మరియు పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం అభివృద్ధిలో భాగంగా పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా నేడు గాంధీజీ విగ్రహం వద్ద పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులతో కలిపి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భీమవరం అభివృద్ధికి దాతలు సహకారం మరువలేనిదన్నారు.
స్థానిక శాసనసభ్యులు మరియు పి ఎస్ సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో భీమవరంలో సుందరీకరణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులను పూర్తిచేసి భీమవరం పట్టణాన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బాంబే స్వీట్స్ యజమాని పొత్తూరి బాపిరాజు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ.రాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఏం సి వైస్ చైర్మన్ బండి రమేష్, సూర్యమిత్ర ఎగ్జామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి యర్రంకి సూర్యారావు, స్థానిక నాయకులు చంద్రశేఖర్, కేత శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


