జనవరి 6న ఉండి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జనవరి 6వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 8:40 గం.లకు రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 10:30 గం.లకు ఉండి జడ్పీ హైస్కూల్ కు చేరుకుంటారు. అధునాకరించిన108 సంవత్సరాల హై స్కూల్ భవనాన్ని, క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉ.11.00 గం.లకు ఉండి హై స్కూల్ నుంచి బయలుదేరి పెద్ద అమిరం భీమవరం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ప్రారంభించి, అనంతరం రతన్ టాటా మార్గ్ గా నామకరణ చేసిన భీమవరం ఉండి లింక్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉ.11.30 గంటలకు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఓపెన్ ఆడిటోరియం లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ఏఐసిటిఇ ఐడియా ల్యాబ్ ను సందర్శిస్తారు. మ.12.30 గంటలకు ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి బయలుదేరి శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు గృహానికి చేరుకుని, విందును స్వీకరిస్తారు. మ.1.30 గంటలకు ఉప సభాపతి గృహం నుండి బయలుదేరి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గృహానికి మ.1.50 గంటలకు చేరుకుంటారు. తిరిగి మ.2.00 గంటలకు భీమవరం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ వెళ్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సంబంధిత అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.