Close

చేకూరి రామబద్రిరాజు దాతృత్వంతో భీమవరం పాత బస్టాండ్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు అయిందని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 22/09/2025

చేకూరి రామబద్రిరాజు, పార్వతి దంపతుల ఆర్థిక సహకారముతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణములో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణ రాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

తొలుత నూతన ఆర్టిసి కాంప్లెక్స్ లో శాస్త్రోక్తతంగా పూజలు నిర్వహించిన అనంతరం నాలుగు ప్లాట్ ఫామ్ లను, శిశువులకు పాలు ఇచ్చే గది, రిజర్వేషన్ అండ్ కార్గో కౌంటర్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవ్య భీమవరంలో భాగంగా చేకూరి రామబద్రిరాజు, పార్వతి దంపతుల ఆర్థిక సహకారముతో భీమవరం పాత బస్టాండ్ నూతన ఆర్టిసి కాంప్లెక్స్ ను నిర్మించుకోవడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. ఏళ్ల తరబడి కనీస మౌలిక వసతులు లేకుండా మహిళలు, పిల్లలు, దూర ప్రాంతాల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, వారికి చక్కటి సౌకర్యవంతమైన కాంప్లెక్స్ నిర్మాణానికి ముందుకు వచ్చి పూర్తిచేసిన రామబుద్రి రాజు వారి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. రామబద్రిరాజు కుటుంబాన్ని ప్రోత్సహించి కార్యరూపందాల్చేలా చేసిన లైన్స్ ఇంటర్నేషనల్ సిహెచ్ కృష్ణంరాజును ప్రత్యేకంగా అభినందించారు. నిర్మాణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేసిన భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్ర రెడ్డి లను అభినందించారు. భవ్య భీమవరం అభివృద్ధికి దాతలు హితోథికంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన భీమవరం పాత బస్టాండ్ కు కొత్త నిర్మాణాలు చేయించడంలో కృషిచేసిన జిల్లా కలెక్టర్ ఎంతో అభినందనీయులు అన్నారు. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని, చేసేది మంచి పని అయితే భీమవరంలో దాతలకు కొరవులేదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఆర్డీవో మరియు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్.వి.ఆర్. వరప్రసాద్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్ వేగేశ్న సూర్యనారాయణ రాజు, తహసీల్దార్ రావి రాంబాబు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మాజీ ఎఎంసి చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు, లైన్స్ ఇంటర్నేషనల్ సిహెచ్. కృష్ణం రాజు, స్వచ్ఛంద సేవకులు కంతేటి రామ రాజు, స్థానిక నాయకులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.