చిన్నరంగడిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

మధ్యాహ్న భోజన పథకం అమలు మెనూ వివరాలు ఆరా
వండిన పదార్థాలను రుచి చూసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పట్టణంలో చిన్నరంగడిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా పదవ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలు కూర్చున్న బెంచి పై కూర్చుని వారితో ముచ్చటించారు. బాగా చదువుకుంటున్నారా, ఉపాధ్యాయులు బోధించే పాటలు అర్థం అవుతున్నాయా, వారు చెప్పిన పాఠములు ఇష్టముగా చదువుకుని మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని అన్నారు. పిల్లలు ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి. వాటిని నెరవేర్చే బాధ్యత పిల్లలపై ఉంది అన్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా తయారుచేసిన పదార్థాల ను పరిశీలించారు. భోజనము రుచిగా ఉంటుందా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు భోజనమును స్వయంగా కలెక్టర్ వడ్డించి రుచి చూశారు. పిల్లలకు పెట్టి ఆహారంలో ఎటువంటి తేడా వచ్చిన ఉపేక్షించేది లేదని, రోజువారి మెనూ ప్రకారం అన్ని తయారు చేసి పెట్టాలని ఎండిఎం వర్కర్లును ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్టు ద్వారా అందించిన యూనిఫామ్, పుస్తకములు, బెల్టు, షూస్, కలెక్టర్ పరిశీలించారు. స్కూలు వాతావరణం ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంలో ఎంఈఓ ఎన్.ఎన్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కె.వెంకట్రావు, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.