చిత్రాయి చెరువు గట్టు ప్రాంతంలో తాగునీటి కారణంగా ఒంటిపై దురదలు వచ్చాయి అనే సందేశం గురువారం రాత్రి అందిన వెంటనే వైద్య శాఖ అధికారును అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్..
రాత్రికి రాత్రే వైద్యాధికారులు ప్రతి ఒక్కరిని పరిశీలించి స్కిన్ ఎలర్జీ ఉన్న 54 మందిని గుర్తించి ఆయింట్మెంట్, టాబ్లెట్లు పంపిణీ.
ప్రమాదకర పరిస్థితి లేదని ధ్రువీకరించిన వైద్యులు
త్రాగునీటి కారణంగా స్కిన్ ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నవారు భయపడవలసిన అవసరం లేదు.. అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాం
త్రాగు నీటిని వెంటనే తనిఖీ చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు
శుక్రవారం త్రాగునీటి సరఫరాను తనిఖీ చేసి పంచాయతీ సెక్రటరీకి స్వల్ప జాగ్రత్తలను తెలియజేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
జిల్లాలోని అన్ని త్రాగునీటి ట్యాంకులను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతి అధికారులకు ఆదేశాలు
… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
గురువారం రాత్రి సుమారు 8.00 గంటల సమయంలో పాలకొల్లు రూరల్ మండలం గ్రామ పంచాయతీ పరిధిలోని చిత్రాయి చెరువు గట్టు ప్రాంతంలో నివసించే కె.ఎన్.వి.అయ్యప్ప మా ప్రాంతంలో త్రాగునీటి కారణంగా స్కిన్ ఎలర్జీ వచ్చి ఇబ్బంది పడుతున్నామని జిల్లా కలెక్టర్ చరవాణి కి సందేశాన్ని పంపడంతో, జిల్లా కలెక్టర్ వెంటనే అప్రమత్తమై వైద్యాధికారులను, వైద్య సిబ్బందిని అక్కడికి పంపి స్కిన్ ఎలర్జీ కి వైద్యం చేయించాలని డిఎంహెచ్వోను ఆదేశించడం జరిగింది. అనంతరం గ్రామీణ నీటి సరఫరాధికారులను ఆదేశిస్తూ శుక్రవారం ఆ ప్రాంతానికి వెళ్లి నీటి సరఫరాలో లోపాలను తనిఖీ చేసి నివేదికను అందజేయాలని ఆదేశించడం జరిగింది. గురువారం రాత్రి హుటాహుటిన వైద్యులు, సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రతి ఒక్కరిని పరిశీలించి స్కిన్ ఎలర్జీ గుర్తించిన 54 మందికి అవసరమైన ఆయింట్మెంట్, టాబ్లెట్లను ఇవ్వడం జరిగింది. ఈరోజు శుక్రవారం ఉదయం గ్రామీణ నీటి సరఫరా అధికారులు తాగునీటి సరఫరా విభాగం అంతటిని పరిశీలించి చిన్న, చిన్న పరిశుభ్రత చర్యలను చేయవలసిందిగా పంచాయతీ సిబ్బందికి సూచించడం, వెంటనే ట్యాంకు ను శుభ్రపరచడంతోపాటు, మిగిలిన చిన్న, చిన్న లోపాలను కూడా సరిచేయడం జరిగింది. నాలుగు ప్రదేశాలలో నీటి నమూనాలను సేకరించడం జరిగింది. అనుమతించదగిన పరిమితుల్లో నీటి రసాయన విశ్లేషణ, బాక్టీరియా పరీక్ష పురోగతిలో ఉంది, ఫలితాలు 24 గంటల తర్వాత వస్తాయనీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. చిత్రాయి చెరువు గట్టు ప్రాంతం ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందవద్దని, తాగునీటి సరఫరా లోని చిన్న లోపాలను సరి చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని త్రాగునీటి ట్యాంకులను, పైప్ లైన్ లీకేజీలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
చిత్రాయి చెరువు గట్టు ప్రాంతంలో డిఎంహెచ్వో జి.గీతబాయి, ఆ ప్రాంతంలోని మెడికల్ అధికారి, వైద్య సిబ్బంది, గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఇ కే.శ్రీనివాసరావు, డి ఈ రవి రాజా, ఏఈ రమణ, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ టీ.మూర్తి బాబు, గ్రామపంచాయతీ సెక్రటరీ గాయత్రి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను చక్కదిద్దడం జరిగింది.