ఘనంగా స్వర్గీయ శ్రీ ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు.
భారతదేశంలో వస్త్ర కళలలో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు.
* జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
చేనేత బాంధవుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి సందర్భంగా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్వో పీ. ప్రభాకర్,జిల్లా జౌళిశాఖ శాఖ ఏడి ఎ.అప్పారావు, జిల్లా పరిశ్రమలశాఖ మంగపతిరావు, ఎల్ .డి.ఎం.నాగేంద్ర ప్రసాద్ తో కలిసి ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలోని వస్త్ర కళలలో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రాముఖ్యత చేనేత రంగంలో భారత దేశానికి ఉందని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి విదేశాల లో తమ వస్త్రాలకు ప్రాముఖ్యత తగ్గి పోతుందని స్వదేశీ వస్త్ర కార్మికుల నైపుణ్యం తగ్గించేందుకు అనేక ఇబ్బందులకు గురి చేశారనిఈ సందర్భం గా తెలియజేశారు. ఎన్నో ఒడిదుడు కులు ఎదుర్కొని చేనేత రంగాన్ని ప్రపంచపటంలోనే గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత ఆయనదన్నారు. 16 వేల ఎకరాలు భూములను అవసర మైన వాటికి హక్కు లు కల్పించే విధంగా పోరాడిన ఘనత ఆయనకు దక్కు తుందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయు డు ప్రగడ కోటయ్య అని కొనియాడారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి, నేత కార్మికుల ఆర్థిక పురోగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. చేనేత రంగానికి ఆయన వేసిన పునాదులు నేటికీ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. చేనేత కార్మికు లకు ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు, సబ్సిడీలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవా లని అన్నారు. స్థానిక చేనేత వస్త్రాలను ప్రోత్స హించాల్సిన బాధ్య త సమాజంలో ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో పీ. ప్రభాకర్, జిల్లా చేనేత జౌళి శాఖ శాఖ ఏడి ఎ. అప్పారావు, జిల్లా పరిశ్రమల శాఖ మంగపతిరావు, ఎల్ డి .ఎం నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.