Close

గ్రౌండ్ ట్రూతింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 28/03/2025

శుక్రవారం పెనుగొండ మండలం పైలెట్ గ్రామం దేవా లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పూర్తిచేసిన అనంతరం హెచ్చుతగ్గులకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకోగా, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు, భూ యజమానులతో కలిసి వారి భూమి వద్దకే వెళ్లి పరిశీలించారు. భూ యజమాని సమక్షంలో తిరిగి సర్వే చేయించగా, కొలతలలో ఎటువంటి తేడా లేకుండా ఖచ్చితంగా రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి భూ యజమానితో మాట్లాడుతూ కొలతల్లో ఎటువంటి పొరపాటు లేదని రికార్డుల ప్రకారం ఖచ్చితంగా భూమి ఉందని, పిటీషన్ దారుడు సరిహద్దు రైతుకు జిల్లా జాయింట్ కలెక్టర్ వివరించారు. సంబంధిత రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడే 162 ధాన్యం వెరైటీ సాగు చేస్తున్న పొలమును జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించి రైతుతో మాట్లాడుతూ ఈ వరి రకం ఇంకా ఎన్ని రోజులకు కోతకు వస్తుందని అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల్లో కోతకు రావడం జరుగుతుందని రైతు బదులు ఇవ్వగా ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొలుగోలు కేంద్రాల ద్వారా ధాన్యమును అమ్ముకోవాలని సూచించారు. సంబంధించిన సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. 80 శాతం గింజ లు గట్టి పడిన తర్వాత వరి కోతలు కోసి రెండు రోజులు పనలు ఆరబెట్టి 17 శాతం తేమకు ఉంచకుండా, రైతు సేవా కేంద్రాలకు ధాన్యమును తీసుకురావాలని సూచించారు. సాధారణ రకం క్వింటాకు రూ.2,300, ఏ గ్రేడ్ రకం క్వింటాకు రూ.2,320 ప్రభుత్వం మద్దతు ధరను కల్పించిందని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకొని రైతులు లాభ పడాలన్నారు.

ఈ సందర్భంలో తాహసిల్దార్ జి.అనిత కుమారి, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.

 

7.11