గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం
జిల్లా పంచాయతీ అధికారి టి.విజయభాస్కర్
గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి టి.విజయ్ భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలోని ఆచంట, మొగల్తూరు, నరసాపురం, పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఆధార్ కార్డు లేదా ఫోటో గుర్తింపు కార్డు, ఎన్నికల విధులు ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి టి.భాస్కర్ కోరారు.