గ్యాస్, ఆయిల్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పెంపొందించాలని జిల్లా జాయింటు కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
భీమవరం పట్టణంలో శనివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్, ఆయిల్ వినియోగంపై నిర్వహించిన అవగాహన వాహనాన్ని, ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.కుమార్ రెడ్డి మాట్లాడుతూ సహజ వనరులు అయిన గ్యాస్, ఆయిల్ ను ప్రజలందరూ పొదుపుగా వాడాలని, ప్రత్యామ్నాయ వనరులైన ఎలక్ట్రికల్ వాహానాలు, సోలార్ వస్తువులు, పర్యావరణ హితమైన బయో ఆయిల్ ఉత్పత్తుల వాడకంపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి జువ్వలపాలెం రోడ్డులోని మోహన్ పెట్రోల్ బంక్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమానికి డీఎస్ఓ ఎన్.సరోజ, ఏఎస్ఓ శివశంకర్, హెచ్పీసీఎల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సేల్స్ అధికారి, జిల్లా అగ్నిమాపణ శాఖ అధికారి బి.శ్రీనివాసరావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంక్ డీలర్స్, తదితరులు పాల్గొన్నారు.