గౌతు లచ్చన్న మార్గం అందరికీ అనుసరణ నియం-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న మార్గం అందరికీ అనుసరణీయం అన్నారు. ఆయన పేద కుటుంబంలో జన్మించి జీవితాంతం అంటరానితనం నిర్మూలనకు బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ తరువాత సర్దార్ అనే పిలవబడే ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా బడుగు బలహీన వర్గాల రైతు కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలను సాగించారని అన్నారు. రాజకీయ జీవితంలో మంత్రిగా పనిచేసి అందించిన సేవలు ప్రజల హృదయాలలో స్థిర స్థాయికి నిలిచి ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు..
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరం, రాజకీయంలో కీలకంగా వ్యవహరించిన గౌతు లచ్చన్న జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. స్వాతంత్ర సమర యోధుడిగా అనేక ఉద్యమాలను నాయకత్వం వహించిన ఆయన ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చెరగనదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు, వసతి గృహాల అధికారులు సి.హెచ్ మోహనరావు, కె.శ్రీనివాస్, గీత, జయంతి, రాజేశ్వరి, జి.ప్రసాద్, కె.సాగర్, కె.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.