గిరిజన సమస్యలపై బ్రిటిష్ పాలకులతో పోరాటాలు చేసిన నాయకుడు బిర్సా ముండను ఆదర్శంగా తీసుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము వారి ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశం మందిరం నందు గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు “శ్రీ భగవాన్ బిర్సాముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన సమస్యల పై బ్రిటిష్ పాలకులతో పోరాటాలు చేసిన నాయకుడు బిర్సా ముండని ఆదర్శంగా తీసుకొని గిరిజనలు అభివృద్ధి చెందాలన్నారు. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు చేసి భారతీయ స్వాతంత్ర పోరాటంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని జాతీయ గౌరవ దివస్ వేడుకలు నవంబర్ 1 నుండి 15 వరకు జరుపుకోవడం జరిగింది అన్నారు. బిర్సా ముండ బీహార్ రాష్ట్ర కు చెందినవాడైనప్పటికీ భారతదేశంలో అన్ని గిరిజన జాతులను అవగాహన కల్పిస్తూ బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరించి స్వాతంత్రం తీసుకురావడంలో ఒకరిని అన్నారు. ఆయన స్ఫూర్తిని క్రమశిక్షణను గిరిజన యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కష్టపడటం నేర్చుకోవాలని చదువుతోపాటు ఆటలు క్రీడలు లో రాణించాలి, హాస్టల్లో చదువుకునే పిల్లలు కాంపిటీషన్ పరీక్షల్లో రాసేందుకు ప్రిపేర్ కావాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సమాజంలో ప్రతి విషయాన్ని గ్రహించి అవగాహన చేసుకుని జీవితంలో అభివృద్ధిని సాధించాలని అన్నారు. గిరిజనుల కష్టాలను తెలుసు కోవడానికి ప్రచారం మాధ్యమాలు లేని రోజుల్లో కొండ ప్రాంతాలకు వెళ్లి గిరిజన ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటాలు చేయడం జరిగిందన్నారు. గిరిజనులు ముక్యంగా రెండు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఒకటి చదువు, రెండు ఆరోగ్యం మని తెలిపారు. గిరిజన పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని గిరిజనలు తమ పిల్లలను బడికి పంపించి బాగా చదివించుకోవలన్నారు. చదువుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. గిరిజన ప్రాంతాలు పరిశుభ్రంతో పాటుగా వ్యక్తిగత శుభ్రతను పాటించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అములు చేస్తుందని వాటి ఉపయోగించుకొని గిరిజనుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమమునకు హాజరైన గిరిజన నాయకులు ట్రైబల్ ఏరియా కె.ఆర్ పురం పరిధిలో వారికి మాత్రమే అన్ని ప్రభుత్వ అవకాశాలు వర్తిస్తున్నాయని, మా డెల్టా ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కి ఏటువంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం లేదని, ట్రైబల్ అధికారులు కూడా తెలియపరచడం లేదని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తెలియని విషయాను ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారి ద్వారా తెలుసుకొని అవగాహన చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ ల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎస్.వి అరుణకుమారి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి. సూరిబాబు, గిరిజన నాయకులు కుతాడ శ్రీనివాస్ రావు, రాజేష్ మానుపాటి సత్తిబాబు, సాల మల్లేశ్వరరావు, సాలా పుల్లయ్య, ఉప్పు దుర్గాప్రసాద్, దాసరి సతీష్, సిబ్బంది , విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.