Close

గత సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువ సమయం ఓటింగ్ కొనసాగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, అవసరమైన చోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 20/08/2025

బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల జాబితా సవరణ, అదనపు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ల నందు ఎక్కువ సమయం పోలింగ్ ను నిర్వహించాల్సి వచ్చిందని, ఇటువంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పోలింగ్ ఎక్కువ సమయం జరిగిన పోలింగ్ స్టేషన్లను గుర్తించి, ఎక్కువ సమయం పట్టడానికి గల కారణాలను విశ్లేషించడంతోపాటు, అవసరమైనచోట అదనపు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో తప్పొప్పులకు తావు లేకుండా ఎప్పటికప్పుడు ఫారం – 6, 7, 8 క్లెయిమ్ లను పరిష్కరించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించుటతోపాటు, ఓటు హక్కు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, టిడిపి ప్రతినిధి మరపట్ల శ్యాంబాబు, బిజెపి ప్రతినిధి కే.రవికుమార్, సిపిఎం ప్రతినిధులు జేవిఎన్ గోపాలన్, కె.గోపాలన్, జె.ఎస్.పి ప్రతినిధి జై శివ పాల్గొన్నారు.