Close

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు

Publish Date : 11/09/2025

గురువారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుండి రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు, ఆర్ఎస్కే లలో సిబ్బంది నియమించి వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు, క్విక్ రెస్పాన్స్ టీమ్ ను నియమించడం జరుగుతుందన్నారు. ఈ టీంలో తహసిల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారన్నారు. ప్రతి ఆర్ ఎస్ కే లో మొదటి విడతగా రైస్ మిల్లర్స్ ద్వారా 33% గోని సంచులు సిద్ధం చేయాలని జిల్లా సహకార శాఖ అధికారిని ఆదేశించారు. ధాన్యం రవాణా చేసే వాహనాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రవాణా శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి ఎంవీ కృష్ణారావు, డీఎస్ఓ ఎన్.సరోజ, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.సత్యనారాయణ, ఏ ఎస్ ఓ ఎం.రవిశంకర్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి రామరాజు, కార్యదర్శి కె.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.