Close

క్షేత్రస్థాయిలో ప్రతిరోజు యోగాబ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 16/06/2025

యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్, మండల, సచివాలయ స్థాయిలో యోగ అభ్యసన కార్యక్రమాల నిర్వహణ, యోగ అభ్యాసకుల హాజరు తదితర అంశాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్రస్థాయిలో ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నందున జిల్లాలో వివిధ లొకేషన్స్ లో ప్రతిరోజు నిర్వహించే యోగా కార్యక్రమాల ఫోటోలు, అభ్యాసకుల హాజరు డేటాను అభ్యాసన కార్యక్రమం పూర్తయిన వెంటనే అప్డేట్ చేయాలన్నారు. యోగభ్యసన కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో ఉందని, దానిని రెండు, మూడు స్థానాలకు చేరుకునే విధంగా క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేసి సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. యోగా భ్యాసనకు హాజరైన ప్రతి ఒక్కరిని క్యూఆర్ కోడ్ ద్వారా హాజరు నమోదు చేయించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం అయినందున పాఠశాల, కళాశాల విద్యార్థులు యోగా కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులను కలిసి వారిని కూడా ఈ యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు దృష్టి పెట్టాలని సంబంధిత ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రస్తుతం యోగా కార్యక్రమం మూడో స్టేజ్ లో ఉన్నామని రాబోయే మూడు రోజులలో సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి యోగా కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత ఫోటోలు హాజరు డేటాను అప్డేట్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల సిబ్బంది, ట్రైనర్లతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి యోగా కార్యక్రమాల నిర్వహణ వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో కొంతమంది ఎంపీడీవోలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, యోగా కార్యక్రమాల నిర్వహణలో విధులు అలసత్వం వహించిన, నిర్దేశించిన లక్ష్యాలు సాధించకపోయిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. యోగఆంధ్ర కార్యక్రమం నిర్వహణలో రాష్ట్రస్థాయిలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా అధికారులు కష్టపడి పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు.

ఈ గూగుల్ మీట్లో జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.