కోపల్లె మంతెన హెరిటేజ్ హోమ్ స్టే రూమ్ లను, సౌకర్యాలను మీడియా బృందంకు స్వయంగా చూపించిన ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ …

గురువారం కాళ్ళ మండలం కోపల్లె మంతెన హెరిటేజ్ నందు రాష్ట్ర పర్యాటక, గృహా నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులకు కోపల్లె మంతెన హెరిటేజ్ హోమ్ స్టే వసతులను స్వయంగా చూపించడం జరిగింది. పురాతన కట్టడాలు అయినను అందంగా తీర్చిదిద్ది హోమ్ స్టే పర్యాటక కేంద్రానికి ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హోం స్టే పర్యాటక కేంద్రాలు అభివృద్ధికి కృషి చేస్తుందని, విస్తృతంగా ప్రచారం చేసి మీడియా తమ వంతు బాధ్యతను పోషించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో మండువాలోగిళ్ళు, పెద్ద భవంతులు కలిగిన యజమానులు దేశ, విదేశాల్లో ఉంటున్నారని వారికి అవగాహన కల్పించి వారి సమ్మతితోనే హోం స్టే శ్రీకారం చుట్టామని అన్నారు. హోమ్ స్టే పర్యటక రంగాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆదాయంతో పాటు, యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని మీడియా మిత్రులు మనస్సు పెట్టి విస్తృత ప్రచారం చేయాలని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, టూరిజం సహాయ సంచాలకులు ఏ.లాజ్ వంతినాయుడు, మేనేజరు ఏ.రాజ్యలక్ష్మి, కన్సల్టెంటు డి.సాహితి, జిల్లా టూరిజం అధికారి ఏ.వి.అప్పారావు, డ్వామా పిడి డా.కె.సి.హెచ్. అప్పారావు,ఇంచార్చి హౌసింగు పిడి జి.పిచ్చయ్య, హోమ్ స్టే నిర్వాహకులు, పాత్రికేయుల బృందం, తదితరులు పాల్గొన్నారు.