కొత్త స్మార్ట్ కార్డులకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.. పూర్తిగా ఉచితం–శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు
ల్లాలో క్యూఆర్ కోడ్ ఆధారిత 5 లక్షల 51 వేల స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభం
కార్డు ముందు భాగంలో కుటుంబ సభ్యుల ఫొటో, వెనుక ప్రభుత్వ వివరాలు ఉంటాయి
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి కార్డుల పంపిణీకి చర్యలు
….. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
శృంగవృక్షం శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో మంగళవారం ఉండి నియోజకవర్గంలో క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రైస్ కార్డులను శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ పంపిణీని మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించే లక్ష్యంగా పాత కార్డులు స్థానంలో రాజముద్రతో ఏటీఎం కార్డు సైజు లో ముద్రించిన క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రైస్ కార్డులను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. స్మార్ట్ రైస్ కార్డు పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్నింగ్ చేస్తే లబ్ధిదారుల పూర్తి వివరాలు ఆన్లైన్లో కనిపిస్తాయన్నారు. లబ్ధిదారుడు ఏ తేదీన, ఏ సమయంలో, ఏ యే వస్తువులను ఎంత పరిమాణంలో ఏ షాపులో తీసుకున్నది సులభంగా తెలుసుకోవచ్చు అన్నారు. ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నందున ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతా భావం చూపాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 5, 51,000 వేల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత రైస్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. వృద్ధులు, వికలాంగులకు వారి ఇంటి వద్దనే రేషన్ అందజేయడం జరుగుతుందన్నారు. పరిపాలనలో పారదర్శకత ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఉండి నియోజకవర్గంలో 81 వేల కార్డులు వారం రోజుల్లో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. కార్డుకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఉండి తహసిల్దార్ కే.నాగార్జున, పాలకోడేరు తహసిల్దార్ ఎం.విజయలక్ష్మి ఆకివీడు తహసిల్దార్ ఎన్.వెంకటేశ్వరరావు, డిఎస్ఓ ఎన్.సరోజ, రేషన్ డీలర్స్, తదితరులు పాల్గొన్నారు.
