Close

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 26/09/2025

సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై నెల రోజుల సెలబ్రేషన్స్ కార్యక్రమం, సీజనల్ కండిషన్స్, పిఎం సూర్యఘర్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, సోలార్, విండ్ ప్రాజెక్టులకు భూ సంబంధిత అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టే ఈనెల 22 నుండి అమలులోకి వచ్చిన జిఎస్టి 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దసరా నుండి దీపావళి వరకు నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార అవగాహనా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జిఎస్టి 2.0 వల్ల రాష్ట్రానికి సుమారు 8 వేల కోట్ల రూ.లు ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రతి కుటుంబానికి 10 నుండి 15 శాతం సొమ్ము ఆదా అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం జిఎస్టి 2.0ను స్వాగతించడం జరిగిందన్నారు. జిఎస్టి తగ్గింపు వల్ల ఏవిధంగా లబ్ది కలుగుతుందనే దానిపై ప్రజలకు విస్తృతంగా తెలియజేసి వారిలో పూర్తి అవగాహన కల్పించేందుకు నెలరోజుల కార్యక్రమాన్ని అనగా అక్టోబరు 19వ తేదీ వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సిఎస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అవగాహనా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులకు జిఎస్టీ ప్రచారానికి సంబంధించి నెలరోజుల కార్యక్రమం వివరాలను తెలియజేస్తూ ఈనెల 25 నుండి 29 వరకూ ఇంటింటికీ జిఎస్టి ఫలాలు పేరిట ప్రచార కార్యక్రమంలో భాగంగా సామాన్య ప్రజలకు గృహ, నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్యా, స్టేషనరీ, బట్టలు, క్రీడా వస్తువులు, మహిళలు, పిల్లలు, రవాణా అంశాలకు సంబంధించి జిఎస్టి తగ్గింపు వల్ల కలిగే లబ్దిపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అదే విధంగా సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 6 వరకూ వ్యవసాయం మరియు ఇతర వృత్తుల వారికి అనగా వ్యవసాయ,ఉద్యాన వన, ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు, పేపరు మరియు ఫ్యాకేజింగ్, సెలూన్లు, స్పా, యోగా కేంద్రాలు, జిమ్, టైక్స్ టైల్స్ రంగాల్లో పనిచేసే వారికి అవగాహన, ట్రాక్టర్ ర్యాలీలు, మేళాలు, ఎగ్జిబిషన్ల నిర్వహణ చేపట్టాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా అక్టోబరు 7నుండి 13 వరకూ మానవ వనరుల అభివృద్ధి మరియు డిజిటల్ సాంకేతికతకు సంబంధించి విద్య, జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్పు, ఇ-కామార్స్ అండ్ గిగ్ ఎకానమీ కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలతో పాటు విద్యార్ధులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, జిల్లా స్థాయిలో మాన్యుఫ్యాక్చర్లు, డీలర్లచే ఎగ్జిబిషన్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీలు, సెమినార్లు వంటి కార్యక్రమాలు చేయాల్సి ఉందన్నారు. అక్టోబరు 14న జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వికాస్ విస్వాస్ – నమ్మకమైన అభివృద్ధికి సంబంధించి బిల్డింగ్, డెవలపర్స్ మరియు కనస్ట్రక్షన్ మెటీరియల్స్ పై ఎగ్జిబిషన్లు, టూరిజం హాస్పిటాలిటీకి సంబంధించి టూరిస్ట్ ఏజెంట్లు, బజ్డెట్ హోటళ్లచే సాండ్ ఆర్ట్, ఫ్లాస్ మాబ్స్ వంటివి నిర్వహించాలని చెప్పారు. 15న ట్రాన్సుపోర్టు, లాజిస్టిక్స్ కు సంబంధించి చిన్న వాహనాల ర్యాలీ, 16న స్పోర్ట్సు గూడ్స్, రెన్యువల్ ఎనర్జీ, ఆటోమొబైల్ మరియు మాన్యు ఫ్యాక్చరింగ్ రంగాల్లో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన, బైక్ ర్యాలీలు వంటివి నిర్వహించాలని చెప్పారు. దీపావళి పర్వదినానికి ముందు రోజైన అక్టోబరు 19వ తేదీన నెలరోజుల కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈప్రచార కార్యక్రమం పర్యవేక్షణ విజయవంతంగా నిర్వహణకు జిఎస్టి చాంపియన్స్ పేరిట జిల్లాలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ని నోడల్ అధికారిగా జిల్లా జిఎస్టి చాంపియన్ గా, సంబంధిత శాఖల జిల్లా అధికారి వారి శాఖ జిఎస్టి చాంపియన్ గాను, అసెంబ్లీ నియోజవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారి, మండల స్థాయిలో ఎంపిడిఏ, మున్సిపల్ కమీషనర్, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పంచాయితీ, వార్డు అడ్మిన్ కార్యదర్శి జిఎస్టి చాంపియన్ గా ఉంటారని తెలిపారు. అంతేగాక ఈనెల రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు, హోర్డింగ్లు, ఇతర ఔట్ డోర్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏలూరు డివిజన్ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ కెపి శైలజ శ్రీ, భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం సర్కిల్స్ కు చెందిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు వి.కేదారేశ్వర రావు, కె.వి. శ్రీనివాసరావు, డి.సాంబశివరావు డి.పి కిరణ్ కుమార్, హ్యాండ్లూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.అప్పారావు, ఐ సి డి ఎస్ పి డి శ్రీలక్ష్మి, డిటి ఎం.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.