Close

కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్ డేటా అప్లోడ్ ని 25వ తేదీలోపు పూర్తి చేస్తాం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 21/08/2025

సెప్టెంబరు 1వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా వాటర్ బులిటెన్లను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు,స్వర్ణాంధ్ర ప్రదేశ్ మానిటరింగ్ డాష్ బోర్డ్, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఈసీజన్లో మెరుగైన రీతిలో వర్షాలు పడ్డాయని రానున్న రెండు మాసాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని అంచనా ఉందని అన్నారు.అన్ని జిల్లాల్లోను భూగర్భ జలాలను పెంపొందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.సెప్టెంబరు 1న జిల్లా వాటర్ బులిటెన్లను విడుదల చేయాలని కలక్టర్లను ఆదేశించారు. గత వారం వాటర్ బులిటెన్లకు సంబంధించి జాతీయ వాటర్ మిషన్ విడుదల చేసిన టాప్ 10 రాష్ట్రాల్లో ఎపి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈనెల 23వతేది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సిఎస్ విజయానంద్ చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మెరుగైన సేవలు అందిస్తున్న వారికి తగిన గుర్తింపును ఇచ్చే లక్ష్యంతో వచ్చే అక్టోబరు 2వతేదీ గాంధీ జయంతినాడు స్వచ్ఛాంధ్ర,స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమంగా నిలిచిన సంస్థలు, ఎన్జిఓలకు స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర స్థాయిలో 50,జిల్లా స్థాయిలో 55 అవార్డులను వివిధ కేటగిరీల్లో ఎంపికచేసి ఈఅవార్డులు అందించడం జరుగుతుందన్నారు.స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ పాఠశాల,స్వచ్ఛ అంగన్వాడీ కేంద్రం,స్వచ్చ ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి సహా ఉత్తమ ఎన్జిఓలు,గ్రీన్ అంబాసిడర్లు తదితర కేటగిరీల్లో ఉత్తమంగా సేవలందించిన వారిని ఎంపిక చేసి జిల్లా,రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రి సమక్షంలో అవార్డులు ఇచ్చే కార్యక్రమం జరిగేలా కలక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో కీ పర్ఫామెన్స్ ఇండికేటర్స్ కి సంబంధించిన డేటా అప్లోడ్ ని 25వ తేదీలోపు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన ఇండికేటర్స్ డేటా పారదర్శకంగా సేకరించి అప్లోడ్ చేస్తామని తెలిపారు. ఆయా శాఖల పరిధిలో సానుకూల ప్రజా దృక్పథంకు సంబంధించి మరింత పురోగతి తీసుకురావాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, సిపిఓ కె.శ్రీనివాసరావు, డిపిఓ ఎం.రామనాథరెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని డి.లక్ష్మి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.