Close

కలెక్టరేట్ మార్గంలో ఏర్పాటుచేసిన సోలార్ లైట్లు ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Publish Date : 31/01/2026

రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నది…

భవ్య భీమవరంలో భాగంగా విస్సాకోడేరు వంతెన నుండి కాలువ గట్టు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణం వరకు, తిరుమల కళాశాల నుండి భారతీయ విద్యా భవన్ వరకు భీమవరం పురపాలక సంఘం, సోలార్ వెoడర్స్ సౌజన్యంతో రూ.14.80 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 వాట్స్ సామర్థ్యం కలిగిన 63 సౌర వీధి దీపాలను కముజువారిపాలెం నందు శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదకత వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ విద్యుత్ పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్లే రహదారి వెంబడి ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు ప్రజలకు భద్రతతో పాటు, రాత్రి సమయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులు, వాహనదారులకు సోలార్ లైటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సాంప్రదాయ విద్యుత్ లైట్లుకు బదులుగా సోలార్ ఆధారిత లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు ప్రభుత్వం ఖర్చులు కూడా ఘనంగా ఆదా అవుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీ ఐ ఐ సి చైర్మన్ మంతెన రామరాజు, ఏపి మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.ఉషారాణి, ఏపీ ట్రాన్స్కో ఎస్ ఇ జి ఆర్.జె నాగేశ్వరరావు, జిల్లా విద్యుత్ శాఖ అధికారి పులి ఉషా రాణి, తహసిల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, ఎలక్ట్రికల్ ఇ ఇ ఎన్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.