Close

కర్నూలు ఉల్లినే వినియోగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, రైతులకు లాభదాయకమైన ధరను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులు ఆదేశించారు

Publish Date : 14/09/2025

ఆదివారం తాడేపల్లిగూడెం బ్రహ్మానంద రెడ్డి హోల్ సేల్ ఉల్లి మార్కెట్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కడప, కర్నూలు నుండి వచ్చిన ఉల్లి పాయలను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈరోజు జరిగిన ఉల్లి ఆక్షన్ ను స్వయంగా పరిశీలించారు. ఉల్లి ధర తక్కువ పలకడంతో హోల్ సేల్ వ్యాపారస్తులతో జేసీ మాట్లాడారు. కర్నూలు, కడప నుండి వచ్చిన ఉల్లి కొనటం ద్వారా రైతులు ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. మార్కెట్లో కొనుగోలు పెరిగితే రైతులకు కొంత ఊరటం లభిస్తుందని చెప్పారు. ఇక్కడ వచ్చే రేటు కన్నా ఎక్కువ రేటు వచ్చే విధంగా మార్కెట్ యార్డులు, రైతు బజార్లు ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని హోల్ సేల్ వ్యాపారస్తులు రైతుకు కనీసం మద్దతు ధర వచ్చేలా సహకరించాలని సూచించారు.

ఈ సందర్భంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, మార్కెట్ యార్డ్ డిప్యూటీ డైరెక్టర్ పాపారావు, జిల్లా మార్కెటింగ్ ఏడి కే సునీల్ కుమార్, తాహసిల్దార్ ఎం సునీల్ కుమార్, హోల్సేల్ వ్యాపారస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.